Homeలైఫ్ స్టైల్Weight loss science: బరువు తగ్గినప్పుడు.. ఆ కొవ్వు ఏమవుతుంది.. ఎప్పుడైనా మీకు ఈ డౌట్...

Weight loss science: బరువు తగ్గినప్పుడు.. ఆ కొవ్వు ఏమవుతుంది.. ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా..

Weight loss science: ఒకప్పుడు మనుషుల్లో శారీరక శ్రమ అధికంగా ఉండేది. దీనివల్ల జీవనశైలి వ్యాధులు వచ్చేవి కాదు. వేలమందిలో ఒకరికి మధుమేహం ఉండేది. అదే స్థాయిలో రక్త పోటు ఉండేది. గుండె జబ్బులు అరుదుగా వచ్చేవి. ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. యంత్రాల వినియోగం అధికమైపోయింది. దీంతో జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. చిన్న వయసు వారిలోనే మధుమేహం వంటి వ్యాధులు వస్తున్నాయి.

వ్యాధులు మాత్రమే కాదు, అధిక కొవ్వు తో బాధపడే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయింది. స్థూలకాయత్వం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల చెడు కొవ్వులు శరీరంలో పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా నడుము చుట్టూ.. తొడలు.. పిరుదుల భాగంలో కొవ్వు పేరుకుపోవడంతో.. చిన్న వయసులోనే చాలామంది లడ్డు బాబుల లాగా కనిపిస్తున్నారు. వాస్తవానికి శరీర ఆకృతి సక్రమంగా ఉంటేనే చూసేందుకు బాగుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు లావు పెరిగితే చూసేవాళ్ళు హేళన చేస్తుంటారు.

ఇటీవల కాలంలో చాలామందిలో స్థూలకాయత్వం కనిపిస్తున్న నేపథ్యంలో.. దానిని తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రకరకాల శారీరక కసరత్తులు చేస్తున్నారు. శరీరంలో కొవ్వు అనేది ట్రై గ్లిజరైడ్స్ రూపంలో ఉంటుంది. వ్యాయామం, డైట్ లో ఉన్నప్పుడు ఆ కేలరీలను శరీరం ఉపయోగించుకుంటుంది.ఆ కొవ్వులను ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తూ ఉంటుంది. ప్రక్రియలో కొవ్వు కరిగిపోయి కార్బన్ డయాక్సైడ్, నీరుగా విడిపోతూ ఉంటుంది. 84 శాతం కార్బన్ డై యాక్సైడ్ గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, మూత్రం ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకు 10 కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4 కిలోలు కార్బన్డయాక్సైడ్ రూపంలో ఊపిరి ద్వారా బయటికి వెళ్తుంది. వన్ పాయింట్ సిక్స్ కిలోలు నీరుగా మారి వ్యర్ధాలుగా బయటకు వెళ్తుంది.

శారీరకంగా కసరత్తులు చేస్తున్నప్పుడు చమట విపరీతంగా వస్తూ ఉంటుంది. ఆ చెమట రూపంలోనే అదనపు కొవ్వు బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్వాస కూడా అధికంగా వస్తూ ఉంటుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక విధమైన రిథమ్.. శ్వాస వదులుతున్నప్పుడు మరొక రకమైన రిథమ్ వస్తూ ఉంటుంది. శ్వాస మన శరీరం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కార్బన్డయాక్సైడ్ రూపంలో అదనపు కొవ్వు బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు శరీరం చాలా బరువును కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో తీసుకునే శ్వాస అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది.

వాస్తవానికి శారీరక కసరత్తులు చేసేవారు దానిని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అదే పనిగా చేయకూడదు. అలాగని మానేయకూడదు. ఒక స్థిరమైన విధానంలో శరీరానికి వ్యాయామాన్ని.. శ్రమను కల్పిస్తూ ఉంటే బాగుంటుంది.. అదనపు కొవ్వు నిలువలు తగ్గిపోతాయి. శరీరం అద్భుతమైన ఆకృతిని సొంతం చేసుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. దీంతోపాటు జీవనశైలి వ్యాధులు రావు. గుండె జబ్బులు.. ఇతర రోగాలు కూడా దరిచేరవు. అందువల్లే శారీరక శ్రమను ఒక అలవాటుగా మార్చుకోవాలి.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. గుండె జబ్బులు.. ఇతర జీవనశైలి వ్యాధులు ఉన్నవారు శారీరక కసరత్తులను వైద్యుల సూచన ప్రకారం చేయాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular