Daily Life: ప్రతి రోజు మనం నిద్ర లేవగానే ఏం చేయాలి? ఏం చూడాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిత్యం మనం నిద్ర లేస్తూనే కొన్ని పనులు చేయాలి? కొన్ని చేయకూడదు. మనకు పనికొచ్చే పనులు చేస్తేనే మంచిది. అంతేకాని పనికి రాని పనులు చేస్తే నష్టమే కలుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నిద్ర లేచిన వెంటనే పనులు చేయకూడదు. కాసేపు విరామం తీసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం చేయాలి. మనసు లగ్నం చేసుకుని ఏకాంతంగా కళ్లు మూసుకుని దేవతలను స్మరించాలి. అప్పుడు రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది.

ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవాలి. అనంతరం ముఖానికి తడుముకోవాలి. అరచేతిలో లక్ష్మి దేవి ఉంటుందని తెలిసిందే. అందుకే మన అరచేతిని స్పష్టంగా చూసుకుని తరువాత మంచం మీద నుంచి లేవాలి. ఇలా చేస్తే మనకు రోజంతా శుభమే జరుగుతుందని పెద్దల విశ్వాసం. రోజులో అన్ని మంచి శకునాలే జరుగుతాయని విశ్వసిస్తారు. అందుకే ఉదయం లేవగానే అరచేతులను చూసుకుని మనసులోనే స్మరించుకోవాలి.
అలాగే తరువాత తల్లిదండ్రులను చూడాలి. వారి ముఖాలను చూసి నమస్కరించాలి. పిమ్మట పెళ్లయిన వారయితే భార్య లేదా భర్త ముఖాన్ని చూడాలి. వీలైతే దేవుడి ఫొటోలను చూడటం కూడా మంచిదే. ఎవరి నమ్మకం ప్రకారం వారు నడుచుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన వారి ముఖాన్ని వారు చూసుకోవచ్చు. ఇందులో ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో కొందరికి ఇంట్లో వారంటే ఇష్టం. ఇంకొందరికి దేవుళ్లంటేనే ఇష్టం. వారి ఇష్టానుసారం నడుచుకోవచ్చు.
మన ఆచార వ్యవహారాలు సనాతన సంప్రదాయాల కలబోతతో ఇమిడి ఉన్నందున మనం ప్రతి రోజు నిద్ర లేస్తూనే మన పూర్వీకులు చూపించిన మార్గంలో నడుచుకునేందుకు సిద్ధమవ్వాలి. దీంతో రోజంతా మనకు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఏదో దైవ కృపతో మనకు కలిసొచ్చే పనులు కూడా జరుగుతాయని నమ్మకం. దీంతోనే మనం నిద్ర లేచిన వెంటనే చేసే పనులు వరుసగా చేస్తూ మనలో కూడా భక్తిభావం దాగుందని గ్రహించుకోవాలి. దీని కోసం ప్రతి రోజు తప్పకుండా దినచర్యలు ప్రారంభించుకోవాలి.