
Virat Kohli Food: భారత క్రికెట్ మాజీ సారధి విరాట్ కోహ్లి. అతడి ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆహారం కోసం ఎన్నో చర్యలు తీసుకోవడం అతడి అలవాటు. అలా కోహ్లి దినచర్య ప్రారంభం నుంచి ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకుంటాడు. ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడైపోతుందని భయపడుతుంటాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆహార అలవాట్లు ఎంతో శ్రద్ధగా ఉంటాయి. ఇలా ఫుడ్ కోసం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుని మంచి పోషకాలు ఉన్న వాటిని తీసుకుని ఫిట్ నెస్ తగ్గకుండా చూసుకుంటాడు.
మరి ఏం తింటాడు?
కోహ్లి భోజనం విషయంలో అప్రమత్తంగా ఉంటాడు. విచ్చలవిడిగా తింటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే ఉదయం పూట మూడు గుడ్లు తింటాడు. తరువాత పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి, చపాతీలు వంటివి తీసుకోడు. కార్బోహైడ్రేడ్లు తక్కువగా ఉండే వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చొరవ తీసుకుంటాడు. కొందరు ఏది పడితే అది తింటూ బరువు పెరిగిపోతారు. ఫిట్ నెస్ లేకుండా చూడటానికి కరెక్టుగా ఉండరు. కానీ కోహ్లి అలా కాదు. మంచి ఆహారం తీసుకుని మంచి చర్యలు తీసుకుంటాడు.
మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజనం విషయంలో కూడా కోహ్లి ప్రత్యేక చొరవ తీసుకోవడం సహజం. మధ్యాహ్న భోజనంలో రైస్ తీసుకుంటాడు. కానీ అవి ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. ఆ బియ్యం ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటి ధర తెలిస్తే మనకు షాక్. రూ.400 నుంచి 500 వరకు కిలో ఉంటాయి. ఇందులో తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉంటాయి. గ్లూటెన్ అసలే ఉండదు. ఈ బియ్యం తింటూ తన ఫిట్ నెస్ కోల్పోకుండా జాగ్రత్త పడుతుంటాడు.

34 ఏళ్ల వయసులో..
కోహ్లి 34 ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్ తో ఉండటానికి అతడి ఆహారమే కారణం. రోజు వ్యాయామం, వాకింగ్ చేస్తుంటాడు. స్వీట్లు అయితే అసలు ముట్టుకోడు. బియ్యం మాత్రం ప్రత్యేకంగా తయారు చేయించుకుని తింటుంటాడు. గతంలో చోలే బటర్ తినేవాడు. కానీ అది కూడా ఇప్పుడు తినడం మానేశాడు. ఇలా కోహ్లి దిన చర్య సాగుతుంది. ఫిట్ నెస్ గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తిండి విషయంలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పడు. తన శరీరం ఫిట్ గా కనిపించేందుకు చర్యలు తీసుకుంటాడు. అందుకే ఇప్పటికి కూడా మంచి శరీర దారుఢ్యం ఉండేలా చూసుకుంటున్నాడు.