Dry January 2026: మద్యపానం హానికరం అని బోర్డులు ఎక్కడ పడితే అక్కడ కనిపించినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఒత్తిడికి దూరంగా ఉండాలని.. శరీరం రిఫ్రెష్ కావడానికి రోజు ఆల్కహాల్ తీసుకోవాలని కొందరు భావిస్తుంటారు. అయితే గతంలో కంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీంతో యువకుల్లో అవగాహన పెరుగుతూ మద్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆల్కహాల్‌కు అడిక్టు అయిన వారు కూడా మద్యం మానివేయడం ఎలా అని ఆలోచిస్తున్నారు? ఇందుకోసం ముందుగా ఒక 30 రోజులపాటు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూసుకోవాలని అంటున్నారు. ఇందులో భాగంగా జనవరి 2026 నుంచి మద్యానికి దూరంగా ఉండాలంటూ డ్రై జనవరి పేరుతో ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇలా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది చెబుతున్న మాట ఈ ఏడాది నుంచి మందు మానేస్తాం.. అని అంటూ ఉంటారు. ఇలా అంటూనే.. అలా మొదలు పెడుతూనే ఉంటారు. మద్యం విషయంలో ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా 2026 కొత్త సంవత్సరం సందర్భంగా డ్రై జనవరి పేరుతో ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల నెల రోజుల్లో అనేక మార్పులు చూడవచ్చని వైద్యులు అంటున్నారు. అసలేం జరుగుతుందంటే
నెల రోజులపాటు మద్యానికి దూరంగా ఉండడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ తగ్గుతుంది. ఆల్కహాల్ కంటే నీటి శాతం పెరుగుతుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మద్యం ఎక్కువగా తీసుకున్నప్పుడు మత్తులో మాత్రమే నిద్ర వస్తుంది. కానీ ఆ తర్వాత నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. నెల రోజులపాటు మద్యానికి దూరంగా ఉంటే నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చు. మద్యం ఎక్కువగా తీసుకునే వారిలో తలనొప్పి, అలసట ఉంటాయి. కానీ ఇప్పుడు వాటి నుంచి బయటపడవచ్చు.
ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో లివర్ సమస్యలు ఉంటాయి. మద్యానికి దూరం ఉండడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే అప్పటికే లివర్ డామేజీ అయితే మాత్రం తిరిగి కోలుకునే అవకాశం తక్కువగా ఉంటాయి. మద్యం మానేయడం వల్ల చర్మంపై కాంతి పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి. గ్యాస్, ఆమ్లాత్వం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. మెమొరీ ఫోకస్ పెరుగుతాయి. ఆల్కహాల్ తక్కువగా తీసుకున్న కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీనిని మొత్తానికి అవాయిడ్ చేస్తే బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇటీవల ఎక్కువ వినిపిస్తున్న పేరు లివర్ ఫ్యాటీ వ్యాధి. ఇది ఎక్కువగా మద్యం తాగే వారిలోనే కనిపిస్తుంది. మద్యానికి దూరంగా ఉండటం వల్ల లివర్‌ను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చు.
అయితే డ్రై జనవరి పేరిట 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇందులో భాగంగా జనవరి నెల మొత్తం ఆల్కహాల్ మానేయడం. అయితే ఇది స్నేహితులతో కలిసి చేయడం వల్ల మరింత ప్రయోజనాలు ఉంటాయి.