Pensioners: గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నారు. అయితే కొందరు ఈ పింఛన్ నేరుగా తీసుకుంటే.. మరికొందరు బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందుతున్నారు. ఇటీవల చాలా బ్యాంకులు ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ నిర్వహించడం లేదు. ఎందుకంటే బ్యాంకులో చాలావరకు ఆర్థిక మోసాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖాతాదారుడి ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు ఈ కేవైసీని పూర్తిచేయాలని అంటున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ పొంది పింఛన్ తీసుకునేవారు ఈ కేవైసీ పూర్తి చేయకుంటే తమ పింఛన్ పొందే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. మరి దీని గడువు ఎప్పటి వరకు ఉందంటే?
ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారు నెల నెల బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ మొత్తాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకునేవారు. ఇలా చేయడంలో ఖాతాదారుల గురించి ఎప్పటికప్పుడు బ్యాంకు వారు తెలుసుకునేవారు. అయితే ప్రస్తుతం ఏటీఎం లేదా ఇతర డిజిటల్ యాప్ ల ద్వారా మనీ విత్ డ్రా చేసుకుంటున్నారు. అయితే కొంతమంది నిజంగానే రిటైర్మెంట్ అయిన వారు పింఛన్ పొందుతున్నారా? లేదా? అనేది తెలియకుండా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మరణించిన కూడా అతని బ్యాంకు అకౌంట్ లో పింఛన్ మొత్తం పడుతూ ఉంటుంది. ఈ సమస్యలను గుర్తించి బ్యాంకు వారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని కోరుతున్నారు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత పింఛన్ పొందే వ్యక్తి తాను డబ్బులు తీసుకుంటున్న బ్యాంకుకు వెళ్లి జీవన్ ప్రమాణ్ అనే సర్టిఫికెట్ను సమర్పించాలి. వివరంగా చెప్పాలంటే ఆ వ్యక్తి బతికి ఉన్నారని తెలపడానికి ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది.
2025 నవంబర్ 30 లోపు ఈ సర్టిఫికెట్ బ్యాంకులో సమర్పిస్తేనే ఆ తర్వాత పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికెట్ సమర్పించని యెడల పింఛన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది బ్యాంకుకు వెళ్లి ఈ దరఖాస్తులు సమర్పించడానికి ఓపిక ఉండదు. లేదా దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటివారు ఆన్లైన్లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్లో ఈ దరఖాస్తు సమర్పించాలంటే www.jeevanpraman.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇలా వివరాలు అందించిన కూడా ఈకేవైసీ పూర్తి అవుతుంది. దీంతో నెల నెల పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నవంబర్ 30 లోపు ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాలి. లేకుంటే ఆ తర్వాత బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒకసారి పెన్షన్ రావడం ఆగిపోతే తిరిగి కంటిన్యూ చేయడానికి సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల రిటైర్మెంట్ అయిన వారు తమ బంధువులు లేదా తాము నేరుగా ఈ కేవైసీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.