Trishakti Yantra Benefits: మనం వాస్తు ప్రకారం ఎన్నో పద్ధతులు పాటిస్తాం. మన ఇల్లు సురక్షితంగా ఉండాలని వాస్తు నియమాలు ాటించాల్సిందే. ఇంటిలో అన్ని రకాల వస్తువులు సరైన దిశలో ఉంటేనే మనకు ప్రయోజనం కలుగుతుంది. లేదంటే బాధలు తప్పవు. నిత్యం పడే బాధల నుంచి విముక్తి కలగాలంటే వాస్తు దోషం లేకుండా చూసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వాస్తు దోషం పట్టకుండా ఉండాలంటే మనం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న పరిహారాలే అయినా మనకు పెద్ద నష్టాలను కలగజేస్తాయి. అందుకే వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయంలో వాటిని అమర్చుకుంటూ మన కష్టాలను దూరం చేసుకునేందుకు శ్రద్ధ తీసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణమాసంలో ఇంటి ఆవరణలో త్రి శక్తి యంత్రం ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా, దుష్ట శక్తులు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే త్రిశక్తి యంత్రం తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిందే. త్రిశక్తి యంత్రం అద్భుత శక్తులు కలిగిన యంత్రం కావడంతో దీన్ని మన ఇంట్లో ఉంచుకుని దుష్ట శక్తుల నుంచి విముక్తి కల్పించుకోవాలని సూచిస్తున్నారు. త్రిశక్తి యంత్రం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎక్కడ ఉంచాలి? అనే విషయాలపై తెలుసుకుందాం.
త్రిశక్తి యంత్రంలో త్రిశూలం, స్వస్తిక్ గుర్తు, ఓంకారం మూడు గుర్తులుంటాయి. త్రిశూలం అంటే మూడు కాలాలకు సంబంధించినదని చెబుతారు. అన్ని శుభకార్యాలకు మనం స్వస్తిక్ గుర్తును వాడుతున్నాం. ఇక ఓంకారం అనేది సృష్టికి మూలమైన గుర్తు. ఓంకారం అంటే పరమశివుడు అని అర్థం. ఇలా ఇన్ని ప్రత్యేకతలున్న యంత్రం కావడంతో దీన్ని ఇంటిలో ఉంచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమే అని తెలుస్తోంది. ఇది ప్రతి ఇంటిలో ఉంచుకోవలసిన యంత్రంగానే చెబుతున్నారు.

పరమేశ్వరుడి, దుర్గామాత చేతుల్లో త్రిశూలం ఉంటుంది. దీంతో త్రిశూలం అంటే అన్ని రకాల బాధల నుంచి మనల్ని కాపాడేదని తెలుసుకోవాలి. శివుడి చేతిలో ఉండే త్రిశూలంలో సత్య, రజ, తమో గుణాల కలయికతో ఉంటుందని చెబుతారు. త్రిశూలంలో ఎన్నో శక్తులు ఉంటాయని ప్రతీతి. ఇక అన్ని దోషాల నివారణకు ఓంకారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. స్వస్తిక్ గుర్తు ఇంటిలో ఉంటే ధనలక్ష్మి మన ఇంటిలో నివాసం ఉన్నట్లే అని చెబుతారు. త్రిశక్తి యంత్రాన్ని తలుపు దగ్గర ఉంచడం వల్ల మనకు ఎలాంటి బాధలు దరిచేరవని తెలుస్తోంది. త్రిశక్తి యంత్రంను ఎల్లప్పుడు ఇంటిలో ఉంచుకోవడం శుభసూచకంగానే భావించుకోవాలి.
Also Read:China- Abdul Raoof: ఆ ఉగ్రవాదిపై చైనాకు ఎందుకు అంత ప్రేమ