Summer Drinks: ఎండలు ఠారెత్తిస్తున్నాయి… వేసవి అరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో వేసవి తాపానికి గొంతెండి పోతోంది. ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి కాస్త చల్లబరిచే పానీయం పోస్తే బాగుంటుందని చాలా మందికి అనిపిస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రకృతి సిద్ధమైన పానీయాలను భారత్‌లో ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ విధంగా తయారు చేసుకుంటారు. మరీ అలాంటి పానీయాలేంటో చూద్దమా..
బాబ్రీ బెయోల్
జమ్మూ కాశ్మీర్‌లో ప్రసిద్ధి చెందిన బాబ్రీ బియోల్ వేసవి తాపాన్ని తగ్గిస్తోంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. తులసి గింజలు లేదా సబ్జా గింజలతో తయారు చేయబడిన ఈ పురాతన వేసవి పానీయం. ఈ పానీయాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ ప్రజలకు పరిచయం చేశారు. పాలు, నీరు, తులసి గింజలు లేదా సబ్జా గింజల, కొబ్బరి వంటి సాధారణ పదార్థాలతో తయారు చేయబడిన పానీయం. స్థానిక భాషలో, దీనిని కాన్ షెర్బత్ అని కూడా పిలుస్తారు, కాన్ అంటే విలువైన ఆభరణాలు, నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజలు ముత్యాలుగా కనిపిస్తాయి కావున ఈ పానీయానికి ఆ పేరు వచ్చింది.
సోల్ కడి
కొంకణ్ తీరం ఒడ్డున ఉద్భవించిన ఈ పానీయం.. కొబ్బరి నీళ్ళు, కోకుమ్ సిరప్‌తో పాటు మిరపకాయలు, జీలకర్ర మరియు ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. మహారాష్ట్రలో ఎక్కువగా ఈ పానీయాన్ని తాగుతారు. వేసవిలో ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.
గోంధోరాజ్ ఘోల్( మజ్జిగ)
మనలో చాలా మందికి మజ్జిగ రుచి గురించి తెలుసు. అయితే పశ్చిమ బెంగాల్ తయారు చేసే మజ్జిగ రుచి మరొలా ఉంటుంది. నిమ్మకాయ గోంధొరాజ్, గోంధోరాజ్ ఘోల్ అని పిలువబడే ఈ పానీయం పెరుగు, నల్ల ఉప్పు, పంచదార, ఐస్‌డ్ వాటర్, నిమ్మకాయ రసం.. ఇలా అన్ని కలిపి సుగంధ తేజస్సుతో ఇది తయారు చేస్తారు. వేసవి కాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు.
చుయాక్
ఈశాన్య భారతదేశంలోని త్రిపుర ప్రాంతంలో ఈ పానీయాన్ని ఎక్కువగా తయారు చేస్తారు. అన్నం,బీరును పులియ బెట్టడం ద్వారా తయారైన ఈ పానీయాన్ని పండుగలు మరియు వివాహాలలో ఎక్కువగా వినియోగిస్తారు. అత్యంత అనుభవజ్ఞులైన పెద్దలచే తయారు చేస్తారు. కుటుంబంతో కలిసి ఈ పానీయాన్ని సేవిస్తారు.
నోంగు షెర్బత్
తాటి చెట్టు ముంజలతో దీన్ని తయారుచేస్తారు. ఇది దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. అయితే దీనిని మహారాష్ట్రలోని టార్గోలా, పశ్చిమ బెంగాల్‌లో తాల్ , తమిళనాడులో నోంగు వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. చక్కెర, నీరు ,సున్నం వంటి సాధారణ పదార్థాలు కూడా ఇందులో మిక్ప్ చేస్తారు
తిఖుర్ షెర్బత్
ఛత్తీస్‌గఢ్‌లోని తూర్పు రాష్ట్రానికి చెందిన మరొక ప్రత్యేకమైన పానీయం తిఖుర్. దీనిని పాలో అని కూడా పిలుస్తారు, ఇది కర్కుమా అంగుస్టి ఫోలియా అనే స్వదేశీ మూలికతో తయారు చేస్తారు. ఈ పానీయం రోజుల తరబడి శ్రమించి దీనిని తయారు చేస్తారు. అంగుస్టిను శుభ్రం చేసి, రాత్రిపూట నానబెట్టిన పేస్ట్‌ను తయారు చేసి, అవశేషాలను వేరు చేసి ఈ పానీయాన్ని తయారు చేస్తారు, ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.