Homeఎంటర్టైన్మెంట్Tollywood Stars In Lord Rama Roles: శ్రీ‌రాముడి పాత్ర‌లో నటించిన హీరోలు వీరే.. ఆదిపురుష్...

Tollywood Stars In Lord Rama Roles: శ్రీ‌రాముడి పాత్ర‌లో నటించిన హీరోలు వీరే.. ఆదిపురుష్ తో మ‌రింత క్రేజ్

Tollywood Stars In Lord Rama Roles: శ్రీరాముడి గురించి తెలియనివారుండరు. రామా అని ప‌ల‌క‌ని వారుండ‌రు. అందులోనూ శ్రీ‌రాముడు తెలుగు వారికి ప్ర‌త్యేకం. రామాయ‌ణ, మ‌హాభార‌తాల‌ను ఎప్పుడూ స్మ‌రిస్తూనే ఉంటారు. రాముడి వ్య‌క్తిత్వం ప్ర‌పంచానికే ఆద‌ర్శం.. ఆచ‌ర‌ణీయం.. దేశ‌వ్యాప్తంగా జై శ్రీరామ్ అంటూ ఆయ‌న పేరు మార్మోగుతూనే ఉంటుంది. హిందువులే కాకుండా ఇత‌ర మ‌తాల వారికి కూడా శ్రీరాముడి గురించి తెలిసే ఉంటుంది. అయోధ్య‌లో రామ మందిరాన్ని ఎంతో వైభ‌వవోపేతంగా నిర్మిస్తున్నారు. కాగా చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.

Tollywood Stars In Lord Rama Roles
NTR

శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైనవాడని అర్థం. శ్రీరామ చంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్ట్స్ బుక్ వంటిది. అలాంటి శ్రీ‌రాముడి పాత్ర‌లో నిజ‌జీవితంలో నాట‌కాల్లో, సినిమాల్లో న‌టించాలంటే మామూలు విష‌యం కాదు. శ్రీ‌రాముడి అభిన‌యం, హుందాత‌నం, క‌రుణ గుణం ప్ర‌ద‌ర్శించాలి. శ్రీ‌రాముడి పాత్ర‌ను మ‌న తెలుగు నటులు ఎలా పోషించారో ఇప్పుడు చూద్దాం…

Also Read: Sri Rama Navami: శ్రీరామనవమి రోజున నైవేద్యంగా పానకం, వడపప్పు ఎందుకు పెడతారో తెలుసా?

సీనియ‌ర్ ఎన్టీఆర్ శ్రీ‌రాముడి పాత్ర‌లో గొప్ప‌గా న‌టించారు. నిజంగా శ్రీ‌రాముడు ఇలాగే ఉంటాడేమో అనేంత‌లా న‌టించారు. కేవ‌లం రాముడు అనే కాదు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు ఇలా ఆయ‌న ఏ పాత్ర చేసినా అద్భుతంగా న‌టించేవారు. అందులో ఆయ‌న పేరుకు త‌గ్గ రాముడి పాత్ర‌నైతే ఇక చెప్ప‌లేం. ఆ ఘ‌న‌త ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది.

Tollywood Stars In Lord Rama Roles
NTR

 

సోగ్గాడు శోభన్ బాబు కుటుంబ కథా చిత్రాలతో పాటు మైథలాజికల్ మూవీస్ కూడా చేశారు. సంపూర్ణ రామాయణం సినిమాలో ఆయన రాముడిగా, సీతగా చంద్రకళ నటించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అలాగే కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో నాగార్జున హీరోగా వచ్చిన భక్తిరస చిత్రం శ్రీరామదాసు లో సీనియర్ హీరో సుమన్ రాముడి పాత్రలో ఆక‌ట్టుకున్నాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన దేవుళ్ళు చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ కాసేపు శ్రీరాముడిగా కనిపించాడు.

Sampoorna Ramayanam
Sampoorna Ramayanam

నమదమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన శ్రీ రామరాజ్యం సినిమాలో రామయ్యగా బాలయ్య చక్కగా నటించి మహానటుడు నందమూరి తారకరామారావు లేని లోటుని తీర్చారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడు తారక్ తొలుత వెండితెరపై రాముడి పాత్రతోనే అడుగుపెట్టారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో శ్రీరాముడిగా చిన్న వయసులోనే ఎన్టీఆర్ అద్భుత నటన ప్రదర్శించారు.

Sri Rama Rajayam
Sri Rama Rajayam

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టించ‌నున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ నిర్మిస్తున్న ఆదిపురుష్ చిత్రం వాల్మికి రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్ ఈ మూవీలో శ్రీ‌రాముడిగా క‌నిపించనున్నారు‌. ఈ మూవీ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీరాముడిని ఆరాధించేవారు, ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Adipurush
Adipurush

 

Also Read:Social Updates: సినీ స్టార్స్ లేటెస్ట్ క్రేజీ పోస్ట్ లు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Pragya Jaiswal: మద్యం తాగడం మన రాష్ట్రంలో మామూలే. మద్యం బాటిళ్లపైనే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పి మరీ అమ్ముతున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మిట్లే మందు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని చెబుతూనే అమ్మడం విచిత్రమే. ఎవరైనా కోర్టుకు వెళితే మేం వద్దని చెబుతున్నాం. కానీ మా వ్యాపారం కోసం అమ్ముతున్నాం అని చెప్పేందుకేు. దీంతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సర్కారుకు ఆదాయం ఎడాపెడా వస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular