https://oktelugu.com/

Rasi Phalalu: ఈరాశుల వారికి శుభ సమయం.. దైవారాధనే మార్గం!

Rasi Phalalu: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి ఇక్కడ చదివి తెలుసుకుందాం…. మేషం: ఈ రాశి వారు నేడు శుభవార్త వింటారు. అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ చేయడం ఉత్తమం. వృషభం: శుభసమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ జ్ఞానానికి ఇది పరీక్ష సమయం. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో ఇది శుభ సమయం. దైవారాధన తప్పని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 19, 2022 / 08:29 AM IST
    Follow us on

    Rasi Phalalu: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి ఇక్కడ చదివి తెలుసుకుందాం….

    మేషం: ఈ రాశి వారు నేడు శుభవార్త వింటారు. అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ చేయడం ఉత్తమం.

    Rasi Phalalu

    వృషభం: శుభసమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మీ జ్ఞానానికి ఇది పరీక్ష సమయం. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో ఇది శుభ సమయం. దైవారాధన తప్పని సరి.

    మిథునం: శ్రమ పడాల్సిన సమయం ఇది. ఇలానే గుర్తింపు కూడా లభిస్తుంది. అధికారుల దృష్టిని పొందుతారు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేయపట్టన పనులను పూర్తి చేయగలుగుతారు. వారం చివర్లో మంచి జరుగుతుంది. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది.

    కర్కాటకం: ప్రయత్న కార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

    సింహం: మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్ణాష్టకం పఠిస్తే బాగుంటుంది.

    కన్య: ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

    Also Read: వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?

    తుల: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన మంచిది. సూర్య ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.

    వృశ్చికం: మంచి కాలం. ప్రారంభించిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

    Also Read: నేడు జగ్గారెడ్డి రాజీనామా? కాంగ్రెస్ కు షాక్?

    ధనుస్సు: శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    మకరం: ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. నవగ్రహాలను ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

    Also Read: యాడ్స్ ద్వారా మహేష్ సంపాదన ఎంత..? ఆ మొత్తం ఏం చేస్తాడో తెలుసా?

    కుంభం: మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

    మీనం: ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. విందూ,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

    Also Read: క్లీన్‌ షేవ్‌ తో ఆకట్టుకున్న ‘చరణ్’

    Recommended Video: