Marriage Mistakes: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని వివాహాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా సరైన సమయానికి నిర్ణయిస్తారు.
ఇలా పెళ్ళి జరగడం కోసం ఎంతో అమృత ఘడియలలో నిశ్చయించుకున్నప్పటికీ పెళ్లి విషయంలో చాలామంది ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. ఇలా పెళ్లిలో ప్రతి ఒక్కరూ చేసే పొరపాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం…
*పెళ్లిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మాంగల్యధారణ మాంగల్యధారణ సరైన ముహూర్తానికి జరగాలని పెద్దలు చెబుతుంటారు కానీ ప్రస్తుతం ఫోటోలు వీడియోలు పై మక్కువతో వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముహూర్తంలో మాంగల్యధారణ జరగడం లేదు. పెళ్లిలో సరైన ముహూర్తానికి మాంగళ్యధారణ జరగకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, మనోవైకల్యం మంచి సంతానాన్ని పొందలేక పోతారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధూవరులిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో వధూవరులిద్దరూ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఫోటోల వైపు చూస్తున్నారు. ఇలా చేయటం వల్ల భార్య భర్తల మధ్య ప్రేమ లోపిస్తుంది.
స్వచ్ఛమైన తలంబ్రాలకు బదులు మార్కెట్లో దొరికే ధర్మకోల్ ఉపయోగించడం. ఇలా ధర్మకోల్ వేసుకోవటం వల్ల బందు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన వేడుక జరిగే వేదిక పైకి బంధుమిత్రులు చెప్పులు వేసుకుని రావడం.ఇలా చెప్పులు వేసుకొని వేదికపైకి వెళ్లడం వల్ల పెళ్లి మండపం లో ఉండే దేవతలు వెళ్లి పోయి వారి జీవితంలో కష్టాలు వస్తాయి.
పూర్వకాలంలో అందర్నీ కూర్చోబెట్టి అరిటాకులో భోజనం పెట్టేవారు కాని ప్రస్తుత కాలంలో బఫే సిస్టమ్ రావడం వల్ల అందరూ దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా చేయటం వల్ల పెళ్లిలో మనం పెట్టిన భోజనానికి ఫలితం ఉండదు.ఇలా పెళ్లిలో చాలా మంది చేసే అతి పెద్ద పొరపాట్లు ఇవే ఇలా చేయడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.