Sedan Cars: భారత మార్కెట్లో వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో sedan, SUV కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే SUV కార్లతో ఎక్కువ ప్రయోజనాలు ఉండడంతో sedan విక్రయాలు తగ్గిపోయాయి. అంతేకాకుండా ఎస్ యు వి కార్లలో ఎక్కువ మంది ప్రయాణించడంతోపాటు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. గత ఏడాది జనవరి, ఈ ఏడాది జనవరి తో పోలిస్తే sedan కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే ఈ సడన్ కార్లలో మాత్రం కొన్ని ప్రముఖంగా సేల్స్ అయ్యాయి. వీటిని వినియోగదారులు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. అందుకు కారణం ఏంటంటే?
2025 జనవరిలో కార్ల సేల్స్ పరిశీలిస్తే మొత్తంగా సెడాన్ కార్లు 32,332 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది అంటే 2024 జనవరిలో మొత్తం 33,851 యూనిట్లో విక్రయించారు. 2024 తో పోలిస్తే 2025 జనవరిలో సెడాన్ కార్లు ఒక వెయ్యి 1,519 యూనిట్లు తగ్గాయి. అయినా కొన్ని కార్లను మాత్రం ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేశారు. వీటిలో మారుతి సుజుకి డిజైర్ బె స్ట్ సెల్లింగ్ గా మారింది. 2025 జనవరిలో మారుతి సుజుకి డిజైర్ 15,383 మంది కొనుగోలు చేశారు. 2024 ఏడాది జనవరిలో దీనిని 16, 733 మంది దక్కించుకున్నారు. దీనిని బట్టి చూస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది జనవరిలో 1,350 తక్కువ మంది కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో మిగతా కార్ల కంటే ఈ కారునే ఎక్కువగా కొనుగోలు చేశారు. సెడాన్ వేరియంట్ లో అత్యధిక సేల్స్ నమోదు చేసుకున్న మరో కారు హుందాయి ఆరా. ఈ కారును గత ఏడాది జనవరిలో 5516 మంది కొనుగోలు చేయగా… ఈ ఏడాది జనవరిలో 53 18 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది 128 మంది తక్కువగా కొనుగోలు చేశారు. అయితే ఈ కారులో ఉండే ఫీచర్స్ కు ఎక్కువగా ఆకట్టుకొని ఉందా ఆరాను చాలామంది ఈ ఏడాదిలో సొంతం చేసుకున్నారు.
హుందాయి తర్వాత హోండా కార్లు ఎక్కువగా కొనుగోలు చేశారు. అయితే పై రెండు కార్ల కంటే ఈ కంపెనీకి చెందిన అమేజ్ ను గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేశారు. ఈ కారు సేల్స్ 2024 జనవరిలో 3,000 ఉండగా.. ఈ ఏడాది జనవరిలో 3,5 91 మంది కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాదిని 591 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత వోక్స్వ్యాగన్, స్కోడా కార్లు వరుసగా నిలిచాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్న తరుణంలో సెడాన్ కార్లకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఎందుకంటే ఈ కార్లు మైలేజ్లో ముందుంటున్నాయి. వీటిలో ఉన్నాయి. మారుతీ కి చెందిన డిజైర్ లీటర్కు 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే చాలామంది సెడాన్ కార్ కోరుకునేవారు మారుతి డిజైర్ కు ఆకర్షితులవుతున్నారు.