Rohit Sharma: టీమిండియా విజయాల జోరు కొనసాగిస్తుందా? ఇంగ్లండ్ లో ప్రారంభమైన విజయయాత్ర వెస్టిండీస్ లో కూడా కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే విజయాలు నమోదు చేస్తోంది. ఇంగ్లండ్ లో టీ20, వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా వెస్టిండీస్ లో కూడా అదే తీరుగా ముందుకు పోతోంది. ఇప్పటికి ఐదు వన్డేల సిరీస్ లో 2-1 స్కోరుతో ముందంజల నిలిచింది. ఇంకా ఒక మ్యాచ్ లో గెలిస్తే చాలు. దీంతో నాలుగో వన్డేలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు.

దుబాయ్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ తరువాత తమ ఆటతీరు మార్చుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ ఇదివరకే స్పష్టం చేశాడు. అక్కడ నుంచి దూకుడుగా ఆడటం అలవాటు చేసుకున్నామని చెబుతున్నాడు. ప్రపంచ క్రికెట్ లో పోటీ పడి ఆడితేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. అందుకే తమ ఆట తీరు మార్పు చేసుకుని విజయాల బాట పట్టినట్లు చెప్పాడు. అందుకే ఇంగ్లండ్, వెస్టిండీస్ లలో విజయాల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా విజయాలతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
Also Read: Pawan Kalyan- Chandrababu Meets Modi: మోదీ, బాబు కలయిక.. : పవన్ అదే కోరుకున్నాడా..?
ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీమిండియా విజయాలు సొంతం చేసుకుంటోంది. గతంలో పలు మ్యాచుల్లో వైఫల్యం చెంది ఓటములు చవిచూశాం. అందుకే ఇక ఆ అపజయాలు రాకూడదని నిర్ణయించుకున్నాం. ఆటతీరు మార్చుకోవాలని భావించాం. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అందుకే విజయాలు దక్కుతున్నాయి. వెస్టిండీస్ లో కూడా అదే జరుగుతోంది. దీంతో అభిమానులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా విజయాల విందును ఆరగిస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్ తో చర్చలు జరిపాక మాలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి నుంచి దూకుడు మంత్రం ప్రయోగిస్తున్నాం. అద్భుతంగా రాణిస్తున్తున్నాం. జట్టు ఏదైనా విజయమే అస్త్రంగా ముందుకు కదులుతున్నాం. తప్పనిసరి విజయం సాధించాలనే తపన మాలో వస్తోంది. దీంతో ఎదుటి జట్టును దెబ్బకొట్టి పరుగులు సాధిస్తున్నాం. స్కోరు ఎంతైనా తెగిస్తున్నాం. సమష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాం. టీమిండియా విజయం రహస్యం ఇదే. కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులోని మాట చెబుతున్నాడు.
Also Read:Chandrababu Meets Modi: మోదీని కలవడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఇదేనా..?