T20 World Cup 2022- India vs Netherlands: టీ20 ప్రపంచ కప్ లో నేడు అక్టోబర్ 27న టీమిండియా నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడించిన ఇండియాకు నెదర్లాండ్స్ మ్యాచ్ ఎలాంటి ఫలితం ఇస్తుందోననే ఆందోళన అందరిలో నెలకొంది. నెదర్లాండ్స్ కూడా ఇటీవల మంచి ఫామ్ లో ఉండటంతోనే మ్యాచ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఓటమి పాలయింది. కానీ పోటీ మాత్రం ఇచ్చింది. దీంతో టీమిండియాకు కూడా నెదర్లాండ్స్ గట్టి పోటీ ఇవ్వనుందనే అంచనాలు వస్తున్నాయి.

ప్రపంచ కప్ క్వాలిఫైంగ్ మ్యాచుల్లో నెదర్లాండ్స్ యూఏఈ, నమీడియాలను ఓడించి మూడు మ్యాచుల్లో రెండు గెలుచుకుంది. శ్రీలంకను కూడా ఓడించి వారికి చాలెంజ్ విసిరింది. పెద్ద జట్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్న నెదర్లాండ్స్ ఇండియాపై ఏం చేస్తుందోననే బెంగ అభిమానుల్లో ఏర్పడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్ పై నెదర్లాండ్స్ బౌలర్లు బంగ్లాదేశ్ ను 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితం చేసింది. ఇందులో బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో గెలవడం గమనార్హం. సిడ్నీ పిచ్ లు బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా ఉంటాయి. దీంతో పరుగుల వరద పారనుంది.
ఈ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా న్యూజీలాండ్ మధ్య అక్టోబర్ 22న జరిగింది. ఇక్కడ టీమిండియాకు మంచి రికార్డే ఉంది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నెదర్లాండ్స్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేసి మన లక్ష్యం నెరవేర్చుకుని అభిమానులకు మరో కానుక అందించాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ కు అందరు ఆతృతగా చూస్తున్నారు.

రెండో మ్యాచ్ కు వర్షం అడ్డం రావడం లేదు. ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెబుతున్నారు. దీంతో వర్షం వచ్చే అవకాశమే లేదు. వర్షం కురిసే చాన్స్ పది శాతమే ఉంది. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుంది. టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ కు ముందు కోచ్ పరాస్ మాంట్రీ స్పందిస్తూ భారత్ ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పు లు ఉండవని చెబుతున్నారు. ఎవరికి విశ్రాంతి ఇవ్వడం లేదని తేల్చేశారు.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్జీప్ సింగ్ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉంది.