Stephanie Matto: సోషల్ మీడియా విప్లవం వచ్చాక ఒక్కోక్కరు ఒక్కోలా ఫేమస్ అవుతున్నారు. కొందరు షార్ట్ ఫిలిమ్స్, మిమిక్రి, పంచ్ డైలాగ్స్, కామెడీ, యాక్టింగ్ ఇలా తమ టాలెంట్‌తో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఆ ఫాలోయింగే వారికి కాసులు కూడా కురిపిస్తోంది. వారు పెట్టిన వీడియోలకు ఎంటర్టైన్మెంట్ యాప్ సంస్థలు వ్యూస్, లైక్స్, షేర్స్‌ను బట్టి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా ఆధారంగా వారు ఉపాధిని పొందుతున్నారు. తాజాగా ఓ 31ఏళ్ల మహిళ అందరికంటే భిన్నంగా థింక్ చేసింది. అందరూ తమ క్రియేటివిటికి పని చెబితే, ఈమె ఏకంగా కడుపులోకి గ్యాస్( అపానవాయువు లేదా పిత్తు)కు కూడా ధర నిర్ణయించి మార్కెట్లో అమ్మడం మొదలెట్టింది.
Also Read: పానీ పూరీ తింటే ప్రమాదమంటున్న వైద్య నిపుణులు.. మధుమేహం వస్తుందంటూ?
మాజీ రియాలిటీ టీవీ స్టార్ అయిన స్టెఫానీ మాట్టో ఉన్నట్టుండి కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిత్తులను గాజు జార్‌లో బంధించి వాటిని ఆన్ లైన్ ద్వారా అమ్మేది. ఒక్కో సీసాకు రూ. 75వేలు.. స్టెఫానీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.81 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో చాలా మంది ఈ అపానవాయువు కలిగియున్న జార్లను కొనుక్కున్నారు. అయితే, మాసన్ జార్‌లో పూలరేకును వేసి అందులో తన గ్యాస్‌ను బంధించేది. మెయిల్ ద్వారా ఆర్డర్స్ స్వీకరించి వారికి డెలివరీ చేస్తోంది. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియడంతో అంతా షాకయ్యారు. ఇదేం బిజినెస్ రా బాబు అని కొందరు తలలు కూడా పట్టుకున్నారట.. ఈ వ్యాపారం ద్వారా స్టెఫానీ వారానికి రూ.38 లక్షల చొప్పున కోటిన్నరకు పైగానే సంపాదించింది. తక్కువ టైంలోనే 90కు పైగా జార్లను విక్రయించింది.
లాభసాటిగా సాగుతున్న పిత్తుల వ్యాపారాన్ని ఆమె సడన్‌గా మానేయాలని నిర్ణయించుకుంది. కారణం ఈ మధ్య ఆమెకు తీవ్రంగా గ్యాస్ ఫామై చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చిందట.. హాస్పిటల్ వెళ్లగా డాక్టర్లు ఫుల్ గ్యాస్టిక్ వలన ఇలా జరిగిందని, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే గుండె నొప్పి రావొచ్చని చెప్పడంతో స్టెఫానీ భయపడిపోయింది. దీంతో ఈ వ్యాపారానికి ఇక టాటా చెప్పాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ వ్యాపారం ద్వారా స్టెఫానీ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది. అయితే, కావాలనే గ్యాస్ కోసం ప్రత్యేకంగా బీన్స్, గుడ్లు, మఫీన్స్, ప్రోటీన్ మిల్క్ షేల్స్ అధికంగా తీసుకోవడం వలన పెద్ద గ్యాస్ కేంద్రాన్ని తన కడుపులోనే క్రియేట్ చేసిందట..
Also Read: ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదా… ఈ 3 దరిద్రపు అలవాట్లే కారణం!