Star celebrity : స్టార్ నటులు టామ్ హాలండ్ (tom holland), జెండయా (Zendaya) నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. జెండయా , టామ్ హాలండ్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు అనే వార్త తెలియగానే వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి ఎంగేజ్మెంట్ విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇక ఈమె గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో డైమండ్ రింగ్ ధరించి కనిపించింది. దీంతో వీరి నిశ్చితార్తం వార్తను కన్ఫామ్ చేసుకున్నారు అభిమానులు. అయితే ఈ వేడుక యునైటెడ్ స్టేట్స్‌లోని జెండయా ఇంట్లో జరిగిందట.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారీ డైమండ్ రింగ్ ధరించి కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక ఆదివారం రాత్రి నటి తన ఉంగరపు వేలుతో కనిపించడంతో హాలీడేస్ లో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లతో ఇంటర్నెట్ షాక్ అవుతుంది. 2021 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట హాయిగా క్రిస్మస్ విరామ సమయంలో వారి సంబంధాన్ని మరో మెట్టు ఎక్కించినట్టు తెలుస్తుంది. ఈ నటుడు “యునైటెడ్ స్టేట్స్‌లోని జెండయా గృహానికి వెళ్లాడట. అక్కడే చాలా కూల్ గా, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్తం జరిగిందట.
అయితే టామ్ నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించకుండా సింపుల్ గా చేసుకున్నారట. కానీ చూడముచ్చటగా జరిగిందని సమాచారం. ఇక ఈ నిశ్చితార్థాన్ని ‘టామ్, జెండయా మధ్య మధురమైన క్షణం’గా అభివర్ణించారు అభిమానులు. ఇక ‘యుఫోరియా’, ‘చాలెంజర్స్’ నుంచి బ్రేకవుట్ స్టార్ అయిన జెండయా 2017 “స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్”లో కనిపించినప్పటి నుంచి ఈమెకు చాలా మంది అభిమానులు అయ్యారు.
అయితే లాస్ ఏంజిల్స్ లో ఓ రిపోర్టర్ వీరి ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూసి ప్రశ్నించారట. ఆమె మట్లాడుతున్నప్పుడు పదే పదే ఆ ఉంగరం చూపించడంతో దాని గురించి ఆరా తీశారట. దానికి జెండయా స్పందిస్తూ అవును మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అని తెలిపిందట.వెంటనే ఆమె తన ఉంగరాన్ని చూపుతూనే ఓ చిన్న స్మైల్ ఇచ్చిందట. నోటితో చెప్పకుండా భుజాలతో స్పందించింది.
అయితే వీరిద్దరు స్పైడర్ మ్యాన్ 2021 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే వీరు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారట. దీనికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ జంట ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందుకు ఇప్పుడే పెళ్లి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వీరు పెళ్లికి కాస్త సమయం కూడా తీసుకుంటారట. పూర్తిగా సినిమా ప్రాజెక్టులు క్లియర్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటారు అని సమాచారం. ఎందుకంటే బిజీగా ఉన్నసమయంలో పెళ్లికి, ఆ తర్వాత లైఫ్ కు సరైన సమయం ఇవ్వలేమని వీరు భావిస్తున్నారట. ఇక వీరి నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఈ జంట అభిమానులతో పంచుకోలేదు. మరి చూడాలి వీరి తదుపరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయో? ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో.