https://oktelugu.com/

Tirumala Tirupati Devasthanam: శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు షాక్.. ఇవి లేకపోతే అనుమతించరట!

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులను టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. దర్శనానికి మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే తిరుమలకు అనుమతిని ఇస్తామని అధికారులు చెబుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా శ్రీవారి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 5, 2021 / 12:05 PM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చే భక్తులను టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. దర్శనానికి మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే తిరుమలకు అనుమతిని ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

    శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా శ్రీవారి దర్శన టికెట్లను సైతం కలిగి ఉండాలి. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా కొంతమంది భక్తులు తిరుమలకు వస్తుండగా అధికారులు వాళ్లను వెనక్కు పంపిస్తుండటం గమనార్హం. భక్తులు ఈ విషయాలను గమనించి టీటీడీకి సహాయసహకారాలు అందిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. చాలామంది భక్తులు టికెట్లు లేకుండా శ్రీవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో టీటీడీ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

    తిరుమలలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జరగనుంది. ఈ నెల 15వ తేదీన జరిగే ధ్వజరోహణ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. టీటీడీ అధికారులు ఏకాంతంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నిర్వహించనుండటం గమనార్హం. కరోనా దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

    రేపు సాయంత్రం ఆరు గంటలకు ఉత్సవాలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరు తెచ్చుకున్న శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ అధికారులు పరిమిత సంఖ్యలో భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.

    Tags