Rohit Sharma Corona: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. బ్రిటన్ టూర్ కు వెళ్లిన జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇన్నాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ కు మరో ప్రమాదం దరిచేరడంతో రోహిత్ కు ఏం చేయాలో తోచడం లేదు. కెప్టెన్ దూరం కావడంతో అపజయాల బాట పట్టిన ఇండియా ఇప్పుడు ఏ మేరకు రాణిస్తుందో తెలియడం లేదు. దీంతో జట్టుకు ఇక కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది.

ఇప్పటికే గాయాల కారణంగా మ్యాచులకు దూరమైన కెప్టెన్ రోహిత్ కు విధి మళ్లీ వెక్కిరించింది. ఇంగ్లండ్ పర్యటనలో విజయాలు నమోదు చేయాలని భావించినా కెప్టెన్ రోహిత్ దూరం కావడం నిజంగా దురదృష్టమే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ లో ఇండియా విజయం సాధిస్తుందా లేక అపజయాలే మూట గట్టుకుంటుందా అనే సందేహాలు వస్తున్నాయి. జులై 1 నుంచి ప్రారంభమయ్యే సిరీస్ లలో టీమిండియా జట్టు వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకుని విజయాలు సాధిస్తుందో లేదో చూడాల్సిందే.
Also Read: Nagababu Emotional Tweet: నాకప్పుడు సెన్స్ లేదు: నాగబాబు సంచలన ట్వీట్
రోహిత్ శర్మ అక్కడే తన గదిలోనే పది రోజులు క్వారంటైన్ లో ఉండనున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మ తోపాటు మిగతా వారికి కూడా సోకిందో ఏమో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో టీమిండియా కష్టాల్లో పడినట్లు అయింది. ఎంతో ఆశలతో ఎదురు చూసిన పర్యటనలో రోహిత్ శర్మ దూరం కావడం నిజంగా దురదృష్టమే. టీమిండియా ఇంగ్లండ్ ను ఎదుర్కొని నిలబడుతుందా లేదో ఎదురు చూడాల్సిందే.

టీమిండియా జట్టుకు ఇటీవల అదృష్టం కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ కెప్టెన్ అయిన నుంచి ఇప్పటివరకు గాయాల కారణంగా దూరమైనా ఇప్పుడు కరోనా కూడా తోడవడంతో జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం జట్టు ఏ మేరకు విజయాలు నమోదు చేస్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ టీమిండియా ఈ పర్యటనలో ఎంత మేరకు సఫలీకృతమవుతుందో అనే కోణంలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ వైరస్ బారిన పడటం నష్టమే అని చెబుతున్నారు.
Also Read:Auction Amravati Lands: అమ్మకానికి అమరావతి భూములు.. చంద్రబాబు కు జగన్ కు ఇదే తేడా