Relation ships : ఈరోజుల్లో చాలామందికి పెళ్లి మీద అసలు ఒపీనియన్ లేదు. ప్రస్తుతం ఉండే వాళ్లు గొడవలు పడటం, విడాకులు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ తరం యువత పెళ్లికి దూరంగా ఉంటుంది. అయితే కొందరు లేట్ గా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపెడుతున్నారు. మారుతున్న జీవన శైలి, చదువు, ఉద్యోగం, వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని మన పెద్దలు అంటుంటారు. కానీ ఈరోజుల్లో అసలు సరైన వయసులో పెళ్లి జరగడం లేదు. మన పెద్దలు అన్నట్టు పెళ్లికి, వయస్సుకి అసలు సంబంధం ఉందా? లేదా? చూద్దాం.
కొంతమంది అభిప్రాయం ప్రకారం.. అసలు పెళ్లికి వయస్సుకి సంబంధమే లేదు. మానసికంగా పెళ్లికి ఎప్పుడు రెడీ అయితే అప్పుడు చేసుకోవచ్చు. పెళ్లి చేసుకునే వయస్సు ఉన్నా.. మెంటల్ గా సరిగ్గా లేనప్పుడు అంత వ్యర్థమే. వయస్సు వచ్చిందని పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే సంగతి. అర్ధం చేసుకునే లైఫ్ పార్టనర్ దొరికినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకు అంటే జీవితాంతం మనతో ఎవరూ ఉండరు. మనల్ని కన్న తల్లిదండ్రులు, మనం కన్న పిల్లలు అయిన ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. మనతో కలిసి ఉండేది ఒక్క లైఫ్ పార్టనర్ మాత్రమే. లైఫ్ లో మనకంటూ ఒక పర్సన్ అన్ని ఎమోషన్స్ షేర్ చేసుకోడానికి ఒకరు ఉండాలి. అది వయస్సుతో రాదు. అర్థం చేసుకునే పర్సన్ ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అసలు వయస్సుకి, పెళ్లికి సంబంధమే లేదని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉండగా.. మరికొందరు ఏ వయసులో చేసుకోవాల్సిన పెళ్లి ఆ వయస్సులో మాత్రమే చేసుకోవాలని అంటున్నారు. ఎందుకు అంటే లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే అండం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. లేట్ మ్యారేజ్స్ వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి సరైన వయస్సులో వివాహం చేసుకుంటే.. అనారోగ్య సమస్యలు రాకుండా మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు. చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఉదాహరణకు 30 తరువాత పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. డానికి తోడు పుట్టిన పిల్లలు ఒక వయస్సు వచ్చే సరికి తల్లిదండ్రులు ముసలి వాళ్లు అయిపోతారు. దీని వల్ల పిల్లలు తరువాత ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఈరోజుల్లో ఎక్కువ కాలం ఎవరూ బ్రతకడం లేదు. కాబట్టి సరైన వయస్సుకి పెళ్లి చేసుకుంటే.. పిల్లలు అన్ని సరిగ్గా అవుతాయని కొందరు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.