RBI Directs Loan Recovery Agents: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రికవరీ ఏజెంట్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రుణ గ్రహీతలకు చుక్కలు చూపిస్తూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్న రుణ రికవరీ ఏంజెట్లకు వార్నింగ్ ఇచ్చింది. అనైతిక విధానాలకు పాల్పడడం, దూషించడం, ఆపై బెదిరింపులకు దిగడంతో వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో.. 24 గంటలు ఫోన్లు చేయడం, వేధించడం, బౌన్సలర్లతో దాడులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని హెచ్చరించింది ఆర్బీఐ. ఈ మేరకు రుణాలు ఇచ్చే బ్యాంకర్లు, లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలు, ఏజెంట్లకు శనివారం కఠినమైన రూల్స్ ఏర్పాటు చేసింది.

బెదిరించడం నిషేధం
రుణ గ్రహీతలను బెదిరించడం పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ఆర్‌బీఐ తాజా రూల్స్‌లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, ఏఆర్సీలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ విడుదల చేసింది. రుణ గ్రహీతలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం లేదా సమాచారాన్ని మాత్రమే అందివ్వాలని రికవరీ ఏజెంట్లకు సూచించింది. ఏ మాత్రం వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందినా ఆయా సంస్థలను పూర్తిగా బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. ఏ రూపంలో కూడా అనుచిత సందేశాలు పంప కూడదని స్పష్టం చేసింది. వేధించొద్దని ఆదేశించింది.
Also Read: BCCI- Indian Cricket Team: మ్యాచ్‌కో కెప్టెన్.. టూర్‌కో కోచ్.. అభాసు పాలవుతున్న బీసీసీఐ
రాత్రి 7 తరువాత ఫోన్ లు చేయొద్దు..
– ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ) ఈ నిబంధనలను తమ రుణ రికవరీ ఏజెంట్లు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రుణ గ్రహీతల నుంచి రుణం వసూళు చేయాల్సి వస్తే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే రుణ రికవరీ ఏజెంట్లు రుణ గ్రహీతలకు ఫోన్ చేయాలని, రాత్రి 7గంటలు తరువాత ఫోన్లు కూడా చేయొద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అర్థరాత్రి వేళల్లో, వేకువ జామున సైతం ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అధికమవుతున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

మితిమీరుతున్న ఆగడాలతో...
దేశవ్యాప్తంగా రికవరీ ఏజెంట్లు చేస్తున్న ఆగడాలను రోజురోజుకూ మితిమీరుతున్నాయి. రుణ గ్రహీతలకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడంతోపాటు రుణాలు తీసుకున్నవారిని వాయిదా చెల్లించడానికి దుర్భాషలాడుతున్నారు. అవసరమైతే బౌన్సర్ల సాయంతో దాడి కూడా చేయిస్తున్నారు. నలుగురిలో ఇలాంటి చర్యలకు పాల్పడడంతో రుణం తీసుకున్నవారు అవమానంగా భావించి ఆత్మహత్య ఏసుకుంటన్నారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలు తట్టుకోలేక పోవడం, ఇబ్బందులకు గురి కావడం గురించి ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై స్పందించిన ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
Also Read:Karthikeya 2 Collections: కార్తికేయ 2 మొదటి రోజు వసూళ్లు..ఇది ఎవ్వరు ఊహించని అరాచకం