IPL 2022: గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ మూడు వరుస విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో మ్యాచ్ ఓడినప్పటికీ … తిరిగి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చింది. టైటాన్స్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో ఫుల్ స్వింగ్ లో ఉందనే చెప్పాలి. అయితే గత ఐపీఎల్ సీజన్లో హార్థిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు సేవలందించిన ఈ ఆల్ రౌండర్ ఈ సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో రెండు కొత్త టీంలు జాయిన్ అవ్వడంతో మెగా వేలం అనివార్యమైంది. ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోగా… ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అతడిని ఎంచుకుంది. అంతేకాకుండా కెప్టెన్సీ బాధ్యతలను కూడా హార్దిక్ చేతిలో పెట్టింది. దీంతో ఏం కసి పెంచుకున్నాడో గానీ.. ఎక్కడా తగ్గడంలేదు. కెప్టెన్సీ సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఆటలో కూడా మంచి ఫామ్ తో విజృంభిస్తున్నాడు.
అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం హార్దిక్ పాండ్యా వెన్నెముక గాయం బారిన పడటం… అనంతరం అతడు ఇంగ్లండ్ లో శస్త్ర చికిత్స కూడా చేయించుకోవడం తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకుని టీంలోకి పునరాగమనం చేసినా మునపటిలా ఆడలేకపోతున్నాడు. బ్యాటింగ్ లో ఓ మోస్తరుగా ఆడుతున్న అతడు బౌలింగ్ చేయాలంటే భయపడుతున్నాడు. మొదట ఐపీఎల్ లో విఫలమైన అతడు అనంతరం టి20 ప్రపంచకప్ లోనూ చతికిల పడ్డాడు. దీంతో క్రికెట్ కు నిరవధిక విరామం ప్రకటించాడు.
అయితే ఐపీఎల్ ప్రారంభ సమయంలో బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీలో క్యాంపును ఏర్పాటు చేయగా హార్దిక్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి వచ్చింది. టీమిండియా కాంట్రాక్టు కలిగిన ప్రతి ప్లేయర్ కూడా విధిగా ఎన్ సీఏలో రిపోర్ట్ చేసి తమ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం మళ్లీ మైదానంలో అడుగు పెట్టలేదు. రంజీ ట్రోఫీకి కూడా దూరంగా ఉన్నాడు. దాంతో హార్దిక్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోగలడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. కానీ ఆర్థిక్ పాండ్యా అన్నింటికీ చెక్ పెడుతూ ఫిట్ నెస్ టెస్ట్ పాసయ్యాడు. అయితే ఫిట్ నెస్ పాస్ అయినా ఐపీఎల్ లో తన ఆట తీరుతో రాణించగలడా.. అనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వీటన్నింటికి ఆర్థిక్ పాండ్యా తన ఆటతోనే సమాధానం ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో పరుగుల వరదా పారిస్తున్నాడు.
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్లు బాది తన సత్తా చాటాడు. అయితే ఈసారి ఎలాగైనా కొత్త జట్టుకు ట్రోపి అందించాలనే కసి హార్థిక్ పాండ్యాలో కనబడుతోంది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ను ఫెర్గూసన్ వేయడానికి రాగా మూడో బంతిని సంజూ శాంసన్ మిడాఫ్ దిశగా ఆడాడు. లేనిపరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రో తో వికెట్లను గిరాటేశాడు. దీంతో శాంసన్ రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే హార్దిక్ వేసిన బుల్లెట్ త్రోకి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న మిడిల్ స్టంప్ రెండు ముక్కలవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీని బట్టి చెప్పవచ్చు హార్ధిక్ పాండ్యా ఆటలో కసి..
[…] […]
[…] […]