Relationships: కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. కయ్యానికేమో కానీ వియ్యానికి మాత్రం వయసు లెక్కలోకి తీసుకుంటారు. అబ్బాయికంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారు. దీంతో వివాహాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. సచిన్ టెండుల్కర్ కంటే ఆయన భార్య అంజలి వయసు ఐదేళ్లు పెద్దది. రామాయణంలో రాముడి కంటే సీత కూడా పెద్దదే. ఇలా వయసు ఎక్కువగా ఉన్న వారిని ఇష్టపడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం అబ్బాయిలు తమకంటే వయసు ఎక్కువగా ఉన్న అమ్మాయిలే కావాలంటున్నారు. ఎందుకంటే అన్నింట్లో వారికి మంచి అనుభవం ఉంటుందని చెబుతున్నారు. ఎవరికైనా అనుభవం ఉంటే ఎదుటి వారికి ఇబ్బందులు రాకుండా చూస్తారు. అందుకే అబ్బాయిలు తమకంటే వయసులో పెద్దగా ఉన్న వారే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో వయసు తారతమ్యం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆడవారు ఓపెన్ గా ఉంటారు. దీంతో అబ్బాయిలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే వయసులో పెద్దవారిని చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం హీరోహీరోయిన్లు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆడవారికి అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఎక్కువగా ఉండటం వల్ల వయసులో పెద్దగా ఉంటేనే మంచి అనుభవం ఉన్న వారిగా గుర్తిస్తున్నారు.
ఎక్కువ వయసున్న వారితో డేటింగ్ చేస్తే లైంగికంగా మంచి అనుభవం ఉండటంతో అబ్బాయిలకు మంచి అనుభవం కలుగుతుంది. అందుకే అబ్బాయిలు ఆంటీలను అమ్మాయిలు అంకుళ్లను చూసుకోవడం సాధారణమే. ఎందుకంటే ఇద్దరిలో మంచి అనుభవం ఉంటుందని నమ్మకం. ఇలా వయసు ఎక్కువగా ఉన్న వారితోనే సంబంధాలు కొనసాగించడం కొసమెరుపు.