Never-leave-people
Never Leave: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం మాత్రమే కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించిన అనేక విలువైన విషయాలు చెప్పారు. కొందరు చాణక్య నీతి సూత్రాలను పాటిస్తూ తమ జీవితాలను మంచి మార్గంలో నడిపించుకుంటున్నారు. సమాజంలో మనుషులు ఎలా ఉంటారు? వారితో ఎలా ప్రవర్తించాలి? వారితో ఏ విధంగా నడుచుకోవాలి? అలాగే కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండాలి? అనే విషయాలపై చాణక్యుడు పరిశోధనలు చేసి ప్రజలకు వివరించారు. చాణక్య నీతి ప్రకారం సమాజంలో ఒక మనిషి మనం మరొక వ్యక్తితో అవసరం కచ్చితంగా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు అందరితో కలిసి ఉండాలి. అయితే కొందరిని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అని చాణక్యుడు చెబుతున్నారు. వీరి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన వారితో స్నేహం చేస్తూ ఉండాలని ఆయన పేర్కొంటున్నారు. మరి అలాంటి వ్యక్తులు సమాజంలో ఎక్కడ ఉంటారు? వారెవరు?
స్నేహితులు:
ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ప్రాణ స్నేహితుడు ఉంటారు. మరికొందరు తో స్నేహం చేస్తారు. అయితే చిన్నప్పటినుంచి స్నేహితులతో ఉన్న వ్యక్తులు పెరిగి పెద్దయ్యాక దూరం అవుతారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో కుటుంబ సభ్యులతో సహా స్నేహితుడు కూడా ముఖ్యపాత్ర పోషిస్తారు. అత్యవసర సమయాల్లో సహాయం చేసేది కూడా వీరే. అందువల్ల ఎంత ఎత్తుకు ఎదిగినా.. లేక ఎంత దూరం వెళ్లినా… స్నేహితులను మాత్రం దూరం చేసుకోవద్దు అని చాణిక్య నీతి తెలుపుతుంది. స్నేహితుల తో కొన్ని సమయాల్లో ఇబ్బందులు ఏర్పడిన ఆ తర్వాత వారితో కలిసిమెలిసి ఉండడమే మంచిది.
కుటుంబ సభ్యులు:
కుటుంబ సభ్యుల తో బంధాలు కలిగి ఉండడం చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కుటుంబ సభ్యులు ముఖ్యపాత్ర పోషిస్తారు. అలాగే ఆపద సమయంలో కూడా కుటుంబ సభ్యులే ఆర్థిక లేదా ఇతర సహాయాలు చేస్తూ ఉంటారు. అందువల్ల కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ఇలాంటివారు ఒక్కోసారి కాస్త నొచ్చుకున్నా వారితో స్నేహంగా ఉంటూ.. వారికి అవసరమైన సహాయం చేస్తూ ఉండాలి. వారితో బంధుత్వాన్ని కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి.
తెలివైనవారు:
సమాజంలో కొందరు మాత్రమే తెలివిగలవారు ఉంటారు. అయితే వీరు ఎప్పుడూ తమదే పై చేయి ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ఇతర వ్యక్తులకు ఇబ్బందులు కలగవచ్చు. కానీ వారితో స్నేహం చేయడం వల్ల మిగతావారు కూడా తెలివి గల వ్యక్తులుగా మారుతారు. అందువల్ల తెలివైన వ్యక్తులను ఎప్పుడు దూరం చేసుకోవద్దని చాణక్యనీతి తెలుపుతుంది. ఇలాంటి వారికి అవసరమైతే ధన సహాయం కూడా చేస్తూ ఉండాలి. వారి వెన్నంటే ఉండడం వల్ల తోటి వారికి తమ తెలివితో సహాయం చేసే అవకాశాలున్నాయి.
గురువులు:
ఒక వ్యక్తి జీవితంలో పైకి ఎదగడానికి తల్లిదండ్రులతో పాటు గురువుల పాత్ర కీలకంగా ఉంటుంది. మంచి గురువుతో కలిసిమెలిసి ఉండడం వల్ల ఆ వ్యక్తి కచ్చితంగా జీవితంలో అభివృద్ధి చెందుతాడు. అందువల్ల గురువులను ఎప్పటికీ విడిచిపెట్టొద్దని చాణక్య నీతి తెలుపుతుంది. కొన్ని కారణాలవల్ల గురువుకు దూరమైన అప్పుడప్పుడు కలుస్తూ వారితో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి.