Health Tips: ఆధునిక కాలంలో మనిషి పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. వింతైన అలవాట్లతో తన ముప్పును తానే కొనితెచ్చుకున్నాడు. త్వరగా ముసలి తనం కూడా వస్తోంది. పూర్వ కాలంలో మనిషి అలవాట్లు ఆహారం భిన్నంగా ఉండేవి. సహజమైన ఆహారం, నిరంతర శ్రమతో నూరేళ్లు హాయిగా జీవించేవారు. కానీ కాలక్రమంలో మనిషి ఆయువు తగ్గిపోతోంది. తాజా లెక్కల ప్రకారం మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలకు తగ్గిపోవడం తెలిసిందే.
గత పరిస్థితులకు నేటికి చాలా మార్పులు వచ్చాయి. పంటలు పండించే క్రమంలో రసాయనిక ఎరువుల ప్రభావంతో ఒళ్లు గుళ్లబారిపోతోంది. ఎముకలు చచ్చుబడిపోతన్నాయి. నలభై దాటిందంటే రక్తపోటు, మధుమేహం లాంటి రోగాలు దరి చేరి మనిషిని ఎక్కువ కాలం బతకకుండా చేస్తున్నాయి. దీంతో సగటు జీవితకాలంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్నాడు.

అయినా తన అలవాట్లను మాత్రం మార్చుకోలేకపోతున్నాడు. మద్యపానం, ధూమపానం, మాంసాహారం లాంటి వాటిని వదులుకోలేకపోతున్నాడు. వీటి సహజీవనంతో మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అయినా తన బలహీనతలను మార్చుకోవడం లేదు. రోజురోజుకు శరీరాన్ని రోగాలకు దగ్గరగా తీసుకొస్తున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఫలితంగా మంచి మార్గంలో పయనించడం లేదు.
ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల క్యాన్సర్, బీపీ లాంటి వ్యాధులు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఉద్యోగాలే అందరికి వస్తున్నాయి. దీంతో ఏం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీవీ చూస్తూ తింటే కూడా రోగాల బారిన పడే అవకాశమున్నా మానడం లేదు. తద్వారా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవడం లేదు. రోగాల నుంచి దూరం కావడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సిందే.
ఆధునిక కాలంలో మనిషి నిద్రకు కూడా క్రమంగా దూరమవుతున్నాడు. నేటి కాలంలో రాత్రి పూట చేసే ఉద్యోగాలే ఎక్కువగా ఉండటంతో నిద్ర లేమి వెంటాడుతోంది. తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలిసినా తప్పడం లేదు.
జిహ్వ చాపల్యం కోసమే అర్రులు చాస్తున్నాడు. కానీ దాంతో వచ్చే నష్టాలను పట్టించుకోవడం లేదు. అందుకే పలు రోగాల బారిన పడుతూ మందులతోనే సహజీవనం చేస్తున్నాడు. శరీరానికి అనర్థాలు వస్తున్నా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా ఆరోగ్యం కోసం తన ఆహారపు అలవాట్లు మార్చుకుని మంచి ఆరోగ్యం సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తే మంచిది.