Nara Disti: మనదేశంలో మూఢ నమ్మకాలు ఎక్కువ. మనం సంపాదించే సంపాదనలో ఎక్కువ భాగం వీటికే ఖర్చు చేస్తుంటారు. మన ఆదాయంలో దేవుళ్లు, దెయ్యాలు, పెళ్లిళ్లు తదితర వాటికి ఖర్చు చేస్తుంటాం. మరీ ఎంత ఎక్కువ అయినా ఫర్వాలేదు. గమ్మత్తేమిటంటే మనవారు చదువుకున్నా కూడా మూఢ నమ్మకాల బారిన పడుతుంటారు. ఎవరో చెప్పిన దాన్ని నత్ముతూ తమ జీవితంలో ఎంతో నష్టపోతుంటారు. ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి వెనకాడరు. అందుకే మన బలహీనతను వారు క్యాష్ చేసుకుంటారు.

ఇక నరదిష్టి. దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనలో నెగెటివ్ ఎనర్జీని చూపించేదే దిష్టి అని చెబుతారు. అంటే మనలో దేనిమీదైనా వ్యతిరేక లక్షణాలు ఉంటే అవి మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అందుకే దిష్టి తగిలిందని అంటుంటారు. ఇంకా ఊర్లలో వారి కళ్లు మంచివి కావని అంటారు. అది చూస్తే మనకు అంతే సంగతి ఏదీ దొరకదు అని చెబుతుంటారు. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read: Marriage Age: పెళ్లి ఏ వయసులో చేసుకుంటే కష్టాలు తప్పించుకోవచ్చు?
పూర్వం రోజుల్లో మనం చూసేవారం. చిన్నపిల్లవాడికి దిష్టి తగిలిందని మిరపకాయలు, నిమ్మకాలు, ఉప్పు, ఆవాలు తదితర వాటితో పిల్లవాడి చుట్టు తిప్పి పొయ్యిలో వేస్తే చిటపటలాడేవి. దిష్టి కూడా అలాంటిదే అని చెప్పేవారు. ఇంతకీ ఇవన్నీ మూఢనమ్మకాలే అని తెలుసుకోవాలి. మనిసిలోని నెగెటివ్ థాట్స్ ను చూపించేవే మూఢనమ్మకాలని గుర్తించాలి. కానీ మనం ఎంత చదువుకున్నా వాటిని నమ్ముతూ ఉంటాం.
నరదిష్టి అని చెబుతూ దాన్ని నివారించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లిళ్లు తదితర వాటికి వెళ్లొచ్చిన వారికి దిష్టి తగిలిందని అంటారు. కానీ అందులో వాస్తవం లేదు. అయితే మనలోని ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడమే దిష్టి అని తెలుసుకోవాలి. దీని కోసం ఏవో చేయాలని చూస్తూ మన డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనలోని విరుద్ధ భావాలు పోతే మనకు ఎలాంటి నష్టం ఉండదు.

ప్రస్తుతం ఊళ్లల్లో వాడు ఇలా బతుకుతున్నాడు అలా పైకి పోతున్నాడంటూ ఏవో చాడీలు చెబుతూ వారిని కించపరచాలనిచూస్తుంటారు అవే దిష్టిగా భావిస్తారు. కానీ మనం మంచి భావనలతోని ఉంటే మంచే జరుగుతుంది. చెడు భావాలు ఊహించుకుంటే చెడే కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా మూఢ నమ్మకాల బారిన పడకుండా తమ పని తాము చేసుకుంటూ పోతే మంచిది. ఏ దిష్టి కూడా ఏం చేయదని తెలుసుకోవాలి.
Also Read:Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లకు చెక్.. కేంద్రం కీలకనిర్ణయం.. ఏం జరుగనుంది?
[…] […]