PM Svanidhi: ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ అయిందా.. రూ.10వేలు పొందే అవకాశం?

PM Svanidhi: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఎంతోమంది ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నారు. అయితే కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాళ్లను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం వీధి వర్తకుల కొరకు ఏకంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. అయితే […]

Written By: Kusuma Aggunna, Updated On : January 22, 2022 3:22 pm
Follow us on

PM Svanidhi: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఎంతోమంది ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నారు. అయితే కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాళ్లను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం వీధి వర్తకుల కొరకు ఏకంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది.

PM Svanidhi

అయితే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందాలని భావించే వాళ్లు తప్పనిసరిగా మొబైల్ నంబర్ కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2020 సంవత్సరం జూన్ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. 2022 సంవత్సరం మార్చి నెల ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం. కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వీధి వర్తకులకు ఖాతాలలో కేంద్రం 10,000 రూపాయలు జమ చేయనుంది.

Also Read: వాట్సాప్‌, టెలిగ్రామ్’ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ ఇవే !

ఎవరైతే ఈ స్కీమ్ కింద డబ్బు తీసుకుంటారో వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా రాయితీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2020 సంవత్సరం మార్చి నెల 24వ తేదీకి ముందు ఆధార్ కార్డ్ కు మొబైల్ నంబర్ లింక్ అయిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ రుణం తీసుకున్న వాళ్లకు మోదీ సర్కార్ రుణంలో 7 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని సమాచారం.

రుణాన్ని తీసుకున్న వాళ్లు సంవత్సరంలోగా రుణాన్ని చెల్లించడం ద్వారా ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. pmsvanidhi.mohua.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: అలెర్ట్ : ఐఫోన్‌ అభిమానులకు శుభవార్త !