https://oktelugu.com/

MG MOTORS : ఫెయిల్ మోడల్’గా నిలిచిన ఈ కారు గురించి తెలుసా?

MG MOTORS : మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని 2021లో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాంపాక్ట్ ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఈ కారును మొదట్లో బాగానే ఆదరించారు. కానీ గత ఫిబ్రవరి సేల్స్ ను చూసి షాక్ అవుతున్నారు. గత నెలలో ఎన్ని అమ్మకాలు జరుపుకుందంటే?

Written By: , Updated On : March 17, 2025 / 03:00 AM IST
MG MOTORS

MG MOTORS

Follow us on

MG MOTORS : భారత్ లో మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్లు కొనడం ఎక్కవవుతోంది. ఒకప్పుడు కారుకు అల్లంత దూరంలో ఉండే వీరు… ఇప్పుడు మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే దాని గురించి తెలుసుకుంటూ ఉంటున్నారు. కంపెనీలు సైతం ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దేశంలోని అగ్ర కంపెనీలతో పోటీ పడుతూ ఇప్పటికే పలు కార్లను తీసుకొచ్చింది MG MOTORS.ఈ కంపెనీకి చెందిన కామెట్ అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో ఉంచుకొని 2021లో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాంపాక్ట్ ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఈ కారును మొదట్లో బాగానే ఆదరించారు. కానీ గత ఫిబ్రవరి సేల్స్ ను చూసి షాక్ అవుతున్నారు. గత నెలలో ఎన్ని అమ్మకాలు జరుపుకుందంటే?

Also Read :కార్ల బుకింగ్స్ కు తత్కాల్ స్కీం.. 35ఏళ్ల క్రితమే దేశంలో అమలు.. దాని స్పెషాలిటీ ఏంటంటే ?

MG MOTORS కార్లకు 2019లో బాగా డిమాండ్ ఉండేది. ఆ సమయంలో ZS అనే మోడల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఈ కారు 2021లో వాల్యూ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తరువాత HSకు కూడా డిమాండ్ బాగానే ఉంది. ఇలాంటి సమయంలో కంపెనీ Astor అనే కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. Artificial Intelligence వేరియంట్ తో రిలీజ్ అయిన ఈ కారుకు మొదట్లో డిమాండ్ బాగానే ఉంది. కాన ఆ తరువాత దీని సేల్స్ తగ్గుతూ వచ్చాయి.

2024 జనవరిలో ఈ కారును కేవలం 1,036 మంది మాత్రమే కొనుగోలు చేశారు. కానీ 2025 జనవరిలో ఇది 264 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోింది. దీంతో ఈ కారు గురించి తీవ్ర ఆలోచనలో పడ్డారు. కాంపాక్ట్ SUV మోడల్ గా రిలీజ్ అయిన ఈ కారులో అనేక ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. డ్యాష్ బోర్డ్ మొత్తం లెదర్ ఫినిషింగ్ తో ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్ వంటివి ఉన్నాయి.

ఈ కారులో సేప్టీ ఫీచర్ష్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కారు డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. లేటేస్ట్ ఫీచర్స్ తో ఉన్న ఈ కారును రూ. 10 లక్షల ప్రారంభ ధరతో విక్రిస్తున్నారు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారు సేల్స్ లో వెనుకబడడానికి కారణంపై చర్చిస్తారు. అయితే కంపెనీ మొత్తంగా దీనిని ఫెయిల్ మోడల్ గా పేర్కొంటున్నారు. కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి ఇది కన్వినెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ కారు సేల్స్ చూసి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పటి వినియోగదారుల కోసం ఈ కారును మార్చి మార్కెట్లోకి తీసుకొస్తారా? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ కారు సేల్స్ ను పెంచడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.