Lotus Chocolate: రిలయన్స్ అంతకంతకు విస్తరిస్తోంది. పిల్లలు ఎదిగిన తర్వాత ముఖేష్ అంబానీ వారికి వ్యాపారాలు అప్పగించి తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటున్నాడు. ఒకప్పుడు పెట్రో ఉత్పత్తులు, కొన్ని కొన్ని వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన రిలయన్స్.. ఇప్పుడు అనేక భిన్నమైన వ్యాపారాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మెరుగైన ఫలితాలను కూడా నమోదు చేస్తోంది.. తాజాగా ఈ సంస్థ ఎఫ్ఎంసీజీ ( ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) విభాగంలోకి ప్రవేశించింది. లోటస్( కమలం) చాక్లెట్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తన ఉద్దేశాన్ని ప్రత్యర్థి కంపెనీలకు గట్టిగా చాటింది. లోటస్ చాక్లెట్ సంస్థను సినీనటి శారద, విజయ రాఘవన్ నంబియార్ తో కలిసి 1983లో ప్రారంభించారు. ఈ సంస్థ యూనిట్ మహబూబ్ నగర్ జిల్లాలోని దౌల్తాబాద్ లో ఉంది.. ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా పనిచేసే సన్ షైన్ ఇన్వెస్ట్మెంట్స్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. చాక్లెట్, కోవా ఉత్పత్తులను తయారు చేస్తోంది.

ఇదీ డీల్ విలువ
లోటస్ చాక్లెట్ ప్రస్తుత ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపుకు సుమారు 74 కోట్లు వెచ్చించి ఈ డీల్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మొత్తం కూడా స్టాక్ మార్కెట్ రూపంలో జరిగింది. అంటే ప్రమోటర్ గ్రూప్ నుంచి 51% వాటాకు సమానమైన షేర్లను రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే ఈ లెక్కన మొత్తం 64 లక్షల 48 వేల 935 షేర్లను… ఒక్కో షేర్ కు 113 రూపాయల చొప్పున మొత్తంగా 74 కోట్లకు దక్కించుకోనుంది.. ఈ సమయంలో మరో 26% వాటాను కూడా ఓపెన్ ఆఫర్ ద్వారా దక్కించుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ఓపెన్ ఆఫర్ పై త్వరలో ప్రకటన చేయనుంది.. ఈ 26% వాటాకు సమానమైన 33 లక్షల 38 వేల 773 షేర్లను ఓపెన్ ఆఫర్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.

చాక్లెట్ల తయారీలో ప్రధాన ముడి సరుకు కోకో గింజలు. ఇవి ప్రస్తుతం తెలంగాణలో విరివిగా లభ్యమవుతున్నాయి.. పైగా ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలో విస్తారంగా సాగవుతున్న నేపథ్యంలో రైతులు అంతర పంటగా కోకోను సాగు చేస్తున్నారు.. మరోవైపు ఈ రంగంలో భారీగా లాభాలు కళ్ళు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో రిలయన్స్ ఈ రంగంలోకి అడుగు పెట్టింది.. ఈ విభాగంలో అరుణ్, వాల్ నట్స్, మేజర్ ప్లేయర్స్ గా ఉన్నాయి.. వాటిని అధిగమించాలంటే రిలయన్స్ కు ఒక మంచి వేదిక అవసరం. దానిని ఈ చాక్లెట్ కంపెనీ కొనుగోలు ద్వారా భర్తీ చేసింది.. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాలనేది రిలయన్స్ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ చెబుతున్నారు.