Homeక్రీడలుKieron Pollard: కీరన్ పోలార్డ్ ఎందుకిలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు?

Kieron Pollard: కీరన్ పోలార్డ్ ఎందుకిలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు?

Kieron Pollard: వెస్టిండీస్ కెప్టెన్.. ఆట్ రౌండ‌ర్ కీర‌న్ పోలార్డ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసున్నాడు. ఈ నిర్ణయంతో క్రికెట్ ల‌వ‌ర్స్.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ప్రాంచైజీ క్రికెట్ ఆట‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ అయోమ‌యంలో ఉన్నారు. ఈ విధ్యంస‌క‌ర ఆట‌గాడు 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్త‌మ‌ ఆల్ఆ‌రౌండర్‌గా రికార్డు సాధించాడు.

Kieron Pollard
Kieron Pollard

అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా టీ20 లీగ్స్‌లో పాల్గొనే పోలార్డ్ వాటి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే టీ 20 వర‌ల్డ్ క‌ప్ కు ముందు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. స్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్.. అంచనాలను అందుకోలేక‌పోతున్నాడు. బ్యాటింగ్ లోనూ.. బౌలింగ్‌లోనూ నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఈ సీజ‌న లో ఇంత‌వ‌ర‌కు ఆ జ‌ట్టు బోణీ కూడా చేయ‌క‌పోవ‌డం విశేషం. అలాగే పోలార్డ్ నిర్ణ‌యం వెనక‌ కొన్ని రోజులుగా అన్ని ఫార్మాట్ ల‌లో విఫ‌ల‌మ‌వుతుండ‌టం కూడా కార‌ణం అయిఉండొచ్చ‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Also Read: AP high Court: మరోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..

పోలార్డ్ బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక పంచుకున్న వీడియోలో ప‌లు విష‌యాలు మాట్లాడారు. వెస్టిండి స్ క్రికెట్ బోర్డుకు థ్యాంక్స్ చెప్పాడు. అన్ని ఆలోచించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. 2007 వెస్టిండీస్ జ‌ట్టులోకి అడుగు పెట్టిన పోలార్డ్ ఆ జ‌ట్టుకు బాధ్య‌త వ‌హించినందుకు గ‌ర్వంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

Kieron Pollard
Kieron Pollard

ఇక వెస్టిండీస్ జట్టు తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీశాడు. 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు తీశాడు.
అలాగే ఇప్ప‌టివ‌ర‌కు 184 మ్యాచ్ లు ఆడారు. 3350 ర‌న్స్ సాధించ‌గా 16 అర్ధ సెంచ‌రీలు చేశాడు. 66 వికెట్లు ప‌డ‌గొట్టి ముంబై జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.

Also Read:CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్

Recommended Videos:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular