Jai Singh Prabhakar: Rolls-Royce కారు కొంతమంది వద్దే కనిపిస్తుంది. ఎందుకంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేవారు మాత్రమే దీనిని కొనుగోలు చేస్తారు. ఈ కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 7 నుంచి 12 కోట్ల వరకు డబ్బులు ఉండాలి. అంత మొత్తం చెల్లించి కారు కొనుగోలు చేయడానికి కొందరు మాత్రమే ధైర్యం చేస్తారు. అయితే ఇంత డబ్బు పెట్టి కొన్న కారును ఎంత అపురూపంగా చూసుకుంటారు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎక్కువ ధర పెట్టిన వస్తువు ఎవరికైనా చాలా విలువైనదిగా అనిపిస్తుంది. కానీ ఒక రాజు మాత్రం ఇలాంటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఒక కారును కొనుగోలు చేశాడు. దీనిని కేవలం చెత్త పారేయడానికి మాత్రమే ఉపయోగించాడు. అలా చెత్తకు ఉపయోగించడం వల్ల ఈ కంపెనీకి చెందిన కార్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. అసలు ఆ రాజు ఇలా చేయడానికి కారణం ఏంటి? అంతా విలువైన కారణం చెత్తకు మాత్రమే ఎందుకు ఉపయోగించాడు?
భారతదేశంలో ఒకప్పుడు రాజ్యాలను పాలించిన కొందరు రాజుల వద్ద అత్యధికంగా ధనం ఉండేది. వీరు తమ జీవితాన్ని ఎంతో హుందాగా గడిపేవారు. ఖరీదైన భవనాలు నిర్మించి.. అత్యంత విలువైన కార్లను కొనుగోలు చేసేవారు. ఇలాగే రాజస్థాన్లోని జైపూర్ కు చెందిన జై సింగ్ ప్రభాకర్ 1920లో ఒకసారి లండన్ కు వెళ్లారు. అక్కడ ఉన్న రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఖరీదైన కారును చూశాడు. అయితే ఈ కంపెనీకి వెళ్ళినప్పుడు రాజు సాధారణ దుస్తులతో వెళ్ళాడు. ఎలాంటి సైనికులు, సహచరులు లేకుండా సింగిల్ గా వెళ్ళాడు. అయితే ఇలా వెళ్లిన రాజులు చూసి ఆ కంపెనీ వాళ్లు అతడిని చిన్న చూపు చూసి బయటకు పంపించారు. అంతేకాకుండా తీవ్రంగా అవమానిస్తూ మాటలు మాట్లాడారు.
దీంతో రాజు మరోసారి సైనికులు, సహచరులతో కలిసి హుందాగా ఆ కంపెనీకి వెళ్ళాడు. అక్కడ అత్యంత ఖరీదైన కొన్ని కార్లను కొనుగోలు చేశాడు. అయితే రాజు ఈ కార్లను కేవలం చెత్తా పారవేయడానికి మాత్రమే ఉపయోగించేవాడు. ఇలా ఈ కార్లు చెత్త పారవేయడానికి ఉపయోగించిన విషయం ప్రపంచానికి తెలిసింది. దీంతో చాలామంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆ కార్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఆ తర్వాత రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన యాజమాన్యం రాజు వద్దకు వచ్చి క్షమాపణ అడిగారు. ఈ సమయంలో రాజు ఒకే ఒక మాట చెప్పాడు. దుస్తులు సాధారణంగా ఉన్నాయని ఇండియన్స్ ని తక్కువగా చేసి మాట్లాడకండి.. ప్రతి ఒక్క భారతీయుడిలో హుందాతనం ఉంటుంది. అయితే అది దుస్తుల్లో కనిపించకపోవచ్చు.. అని అంటాడు.
ఆ తర్వాత జైపూర్ రాజు రోల్స్ రాయిస్ కార్లను చెత్తకు ఉపయోగించడం ఆపేశాడు. దీంతో మరోసారి రోల్స్ రాయిస్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగింది. ఇలా ఒక రాజుకు జరిగిన అవమానాన్ని తన ప్రతీకారంతో తీర్చుకోవడం సంచలనంగా మారింది.