Ravindra Jadeja Pushpa Dialogue: పుష్ప వచ్చి దాదాపు రెండు నెలలు దాటిపోయింది. అయినా ఇంకా దాని ఫీవర్ పోవడం లేదు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అమెరికా దాకా.. విజయవాడ నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా దాకా అంతటా పుష్ప మేనియానే కనిపిస్తోంది. ఏ ముహూర్తాన సినిమాను రిలీజ్ చేశారో గానీ.. అందులో ఉన్న డైలాగులు, హుక్ స్టెప్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి.

భాష, ప్రాంతం లాంటి తేడాలు లేకుండా ఎక్కడైనా సరే తగ్గేదే లే అంటోంది పుష్ప మేనియా. సామాన్య జనం దగ్గరి నుంచి మొదలు పెడితే.. స్టార్ క్రికెటర్ల దాకా.. అందరూ పుష్ప మూవీలోని డైలాగులు, డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే తగ్గేదే లే అంటూ తమకు తాము అన్వయించేసుకుంటున్నారు.
Also Read: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?
ఇక క్రికెటర్లు అయితే అన్ని దేశాల్లో ఉన్న వారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుషీ అయ్యేలా చేస్తున్నారు. తగ్గేదే లే డైలాగ్ చెప్పడం, శ్రీవల్లి పాటకు హుక్ స్టెప్ వేయడం లాంటివి చేస్తుండటంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మొన్నటికి మొన్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా.. అచ్చం పుష్పమూవీలోని అల్లు అర్జున్ గెటప్ వేసుకుని తగ్గేదే లే డైలాగ్ చెప్పడం ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
View this post on Instagram
అప్పుడేమో బయట ఉండి చెప్తే.. ఇప్పుడు ఏకంగా గ్రౌండ్ లోనే పుష్ప ఫీవర్‌ను చూపించాడు. ప్రస్తుతం లక్నోలో జరుగుతున్న ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో జడేజా బౌలింగ్ తో లంక బ్యాట్స్ మెన్ దినేశ్ చండిమాల్ వికెట్ పడగొట్టిన సందర్భంగా.. పుష్ఫ సీన్‌ను చూపించాడు. గడ్డం కింద చేయి పెట్టేసి తగ్గేదే లే అని బన్నీ డైలాగ్ చెప్పేశాడు. ఇంకేముంది ఇదంతా కెమెరాల్లో రికార్డు కావడంతో.. నెట్టింట్లో రచ్చ చేస్తోంది. దీన్ని చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
Recommended Video:
[…] IPL 2022 Schedule: ఇండియాలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి దాకా అందరూ క్రికెట్ లవర్సే. అయితే రెండేండ్లు క్రికెట్ స్టేడియాలకు వెళ్లకుండా క్రికెట్ లవర్స్ చాలా నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంతగానో ఎదర చూస్తున్న ఐపీఎల్ లీగ్‌కు ఎట్టకేలకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది బీసీసీఐ. […]