Success tips: జీవితంలో ఏదైనా సాధించాలని చాలా మంది అనుకుంటారు. అసలు సాధించడం అంటే ఏంటి? అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కొంతమంది చెబుతున్న ప్రకారం అధికంగా డబ్బు సంపాదించడమే జీవితంలో సాధించడం అని అంటుంటారు. కానీ డబ్బు మాత్రమే జీవితం కాదని కొందరు. జీవితంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని.. వాటిని విజయవంతంగా పూర్తి చేయడమే అసలైన విజయమని అంటున్నారు. అయితే విజయం సాధిస్తే డబ్బు దానంతట అదే వస్తుందని.. డబ్బు సంపాదించడం విజయం కాదని కొందరు మేధావులు చెప్తున్నారు. వాస్తవానికి అసలు విజయం ఏంటి? విజయం సాధించడం అంటే ఏం చేయడం?
మానవుల జీవితం ఎన్నో రకాల కష్టాలు, సుఖాలతో ముడిపడి ఉంటుంది. అయితే వీటిని తట్టుకుంటూ ముందుకు వెళ్లాలి. కొందరు కష్టాలు రాగానే తమ జీవితం ఇక అయిపోయిందని చేసే పనులను ఆపేస్తారు. ఇంకొందరు తాము డబ్బు సంపాదించడానికి మాత్రమే పనులు చేస్తామని అనుకుంటారు. వాస్తవానికి డబ్బు సంపాదించడం అనేది జీవితంలో లక్ష్యం కాదు. కొన్ని విజయవంతమైన పనులు పూర్తి చేయాలి.
మనం అనుకున్న పని కోసం ముందుకు వెళితే.. డబ్బు దానంతట అదే వస్తుంది. అయితే ఈ పని చేయడానికి ఇతరుల సహకారం తీసుకోవచ్చు. అంతేకాకుండా మంచి ఉద్దేశంతోనే ఈ పనులు ప్రారంభించాలి. సమాజానికి సేవ చేయడం.. ఇతరుల అవసరాలు తీర్చడం.. పిల్లలను సరైన మార్గంలో పెంచడం.. ఉద్యోగ విధుల్లో న్యాయబద్ధంగా ఉండడం.. వ్యాపార అభివృద్ధి చేయడం.. వంటివి విజయం సాధించే లక్షణాలు. వీటి కోసం కష్టపడితే డబ్బు దానంతట అదే వస్తుంది.
కానీ కొందరు కేవలం డబ్బు డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం అని అనుకుంటారు. కానీ డబ్బు సంపాదించాలని అనుకుంటే తప్పుడు మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. డబ్బు కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుంది. అలా తప్పుడు మార్గంలో వెళ్లిన తర్వాత జీవితం అదుపుతప్పుతుంది. దీంతో అనుకున్న పనులు పూర్తి చేయలేదు. అంతేకాకుండా సమాజంలో చెడ్డపేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అందువల్ల డబ్బు సంపాదించడమే లక్ష్యం అని కాకుండా.. చేసే పనిని విజయవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించుకోవాలి. ఒక క్రీడాకారుడు తన లక్ష్యాన్ని ఒలంపిక్ అని అనుకుంటే.. అందుకోసం మాత్రమే కష్టపడాలి. అలా చేస్తే ఆ వ్యక్తితో పాటు దేశానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ తర్వాత డబ్బు కూడా వస్తుంది. కానీ ఇక్కడ కేవలం డబ్బు కోసం మాత్రమే ఆలోచిస్తే ఒలంపిక్ చేరే అవకాశం ఉండదు. అలాగే మనుషులు కూడా తాము అనుకున్న పనిని పూర్తి చేయాలని మాత్రమే కష్టపడాలి.. కేవలం డబ్బులు మాత్రమే పొందాలని అనుకుంటే సంతృప్తికరమైన జీవితం ఉండదు.