Sparrow: అడవిలో సంచరించే పిచ్చుకలు, తేళ్లు, జర్రీలు అప్పుడప్పుడు జనవాసాల్లోకి వస్తాయి. పిచ్చుకలు ఆహారం కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. అలాగే పాముల, తేళ్లు, జర్రీలు దారి తప్పి వస్తుంటాయి. చాలా సందర్భంలో మన ఇంట్లో అనుకోకుండా వీటిని చూస్తాం. కొందరు ఇవి ఇంట్లోకి వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ సాంప్రదాయవాదులు మాత్రం ఇవి ఇంట్లోకి ఎందుకు దూరాయి..? అన్న విషయంపై ఆలోచిస్తారు. ఇలా రావడం శుభమా..? అశుభమా..? అని మదనపడుతుంటారు. అయితే ధర్మసందేహం ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఇలాంటి విషయాల్లో అనుమానాలు ఉండడం వల్ల మానసిక అశాంతి పొందుతారు. ఆ తరువాత ఇది అనారోగ్యానికి కూడా కారణమవుతుంది.అసలు పిచ్చుకలు, కొన్ని పక్షులు ఇంట్లో వస్తే మంచికా..? చెడుకా..? అనేది తెలుసుకుందాం.

కొన్ని పిచ్చుకలు, పక్షులు లక్మీ వాహనాలు. వాటి మీద లక్ష్మీ దేవత తిరుగుతుందని అంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కల్యాణం జరుగుతుందని అర్థం. అందువల్ల పిచ్చుకలు ఇంట్లోకి రావడం శుభపరిమాణమే. అలాగే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఇల్లును విడిచిపెట్టాలని కొందరు పెద్దలు సూచిస్తారు. కానీ గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనం. ఇది ఇంట్లోకి వచ్చిందంటే వారికి శుభాలు జరుగుతాయనే అర్థం. అనుకోకుండా ఇవి ఇంట్లోకి దూరినా ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదు. ఇక కాకి ఎగురుకుంటూ ఇంటిముందు వాలితే పితృదేవతలు పిలిచినట్లు లెక్క. అయితే కాకి ఇంటి ముందు వాలగానే దానిని వెళ్లగొడతారు. అలా చేయడం మంచిదికాదని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
సీతాకోక చిలుకలు ఇంట్లోకి దూరడం వల్ల ఇంటికి కొత్త వాతావరణం అలుముకుంటుంది. కందిరీగ ఇంట్లోకి వస్తే శుభప్రదం. కందిరీగా ఇంట్లోగూడు కడితే లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అలాగే ఇంట్లో బల్లులు ఉండడం కూడా చాలా మంచిది. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా బల్లులు ఇంటి గొడలపై ఉండడం మంచిది.ఎందుకంటే వానాకాలంలో అనేక కీటకాలు గోడలపై చేరుకుంటాయి. వీటిని బల్లులు వెంటనే తినేస్తాయి.

ఇక పాము, తేలు, జెర్రీలాంటివి ఇంట్లోకి వస్తే అశుభమనే అనుకోవాలి. పాము ఇంట్లోకి దూరిందంటే ఆ ఇంట్లో ఏదో జరగబోతుందని గుర్తించాలి. జెర్రీలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుంది. ఇక కాకి తలపై తన్నితే ఆ వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటివి చోటు చేసుకున్న సంబంధిత జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక గురువుల ద్వారా పరిహారం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు అనుకోకుండా జరిగినా వాటిని మంచి మార్గంలో మారేందుకు దేవున్నిప్రనన్నం చేసుకోవాలి.