BCCI: టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా పరాజయం పాలై ఇంటిదారి పట్టడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ పలు చర్యలు చేపడుతోంది. వయసు పైబడిన వారిని జట్టు నుంచి బయటకు పంపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లను టీం నుంచి పంపించాలని యోచిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీమిండియా జట్టును ప్రక్షాళన చేయనున్నట్లు చూస్తున్నారు.

టీ20 మ్యాచ్ ల్లో ముప్పై ఏళ్లు దాటిన వారు ఉండటంతో సరిగా ఆడలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతోనే వారిని తొలగించి ఇతరులకు చాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022లో జట్టు సెమీస్ వరకు వెళ్లిందంటే సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి ల ఆటతీరుతోనే అని తెలుస్తోంది. ఈ క్రమంలో వారి సేవలు జట్టుకు అవసరమైనా వారి వయోభారం జట్టుకు ప్రతిబంధకంగా మారుతుందని వాదిస్తున్నారు. బీసీసీఐ చేపట్టబోయే చర్యల గురించి అందరిలో ఆసక్తి నెలకొంది.
టీమిండియా ఆటగాళ్ల ఆటతీరుపై అనుమానాలు వచ్చాయి. వారి ప్రదర్శన బాగా లేదని అభిమానులు సెటైర్లు వేశారు. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా అబాసుపాలైంది. విజయాల వేటలో వెనుకబడింది. ఫలితంగా కప్ చేజారింది. టీ20 ఫార్మాట్ కు కొందరిని దూరం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జట్టులో యువరక్తాన్ని నింపాలని బీసీసీఐ పావులు కదువుతోంది. ఇందుకు గాను టీ20 సెటప్ లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

టీ20 వరల్డ్ క్ కు మరో రెండేళ్ల సమయం ఉండటంతో జట్టును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. టీ20 ఫార్మాట్ లో ముప్పై ఏళ్లు పైబడిన వారు ఉండటంతో వారిపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్లు భువనేశ్వర్ కుమార్, షమీ కూడా జట్టులో ఉండరని చెబుతున్నారు. అనుభవం లేని అర్ష్ దీప్ సింగ్ సైతం సరైన రీతిలో స్పందించలేదు. శ్రీలంక జట్టులో సైతం సీనియర్లను పక్కనపెట్టినా ఆ జట్టు కూడా రాణించలేకపోయింది. ఇప్పుడు టీమిండియా చేసే ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియడం లేదు.