IPL Auction 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు సన్నాహాలు జరుగుతున్నాయి. మినీ సమరానికి ఫ్రాంచైజీలు నడుం కడుతున్నాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల వేలానికి వేళవుతోంది. పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఉంచుకుని మిగతా వారిని రిటన్ చేస్తున్నాయి. దీంతో తమ జట్ల భవిష్యత్ కోసం కీలక ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే డిసెంబర్ 23న వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

పది ఫ్రాంచైజీలలో 250 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వేలంలో నిలవాలనుకునే వారు డిసెంబర్ 15లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ హీరోలు, ఇంగ్లండ్ ఆటగాళ్లు, ఔత్సాహికులు ఇప్పటికే తమ పేర్లు ఇస్తున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ ఆటగాడు జో రూట్ కూడా తన పేరు ఎన్ రోల్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ లో సత్తా చాటిన సామ్ కర్రన్, ఆసీస్ ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్, సికందర్ రాజా వంటి వారు తమ పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం.
ఫ్రాంచైజీలు తమకు కావాలనుకున్న ఆటగాళ్లను తమ దగ్గరే పెట్టుకుని మిగతా వారిని రిటన్ చేస్తున్నాయి. వేలంలో కొత్తవారిని కొనుగోలు చేయాలని చూస్తున్నాయి. ఇందు కోసమే సమర్థులైన వారి కోసం వెతుకుతున్నాయి. సత్తా చాటే వారిని తీసుకుని జట్టును విజయపథంలో నిలపాలనే ఆకాంక్ష అన్ని జట్లలో కనిపిస్తోంది. అందుకే వేలంలో ధీటైన ఆటగాళ్లను తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఈసారి కూడా మెగా సమరం కొనసాగనుందని తెలుస్తోంది.

డిసెంబర్ 25న క్రిస్మస్ ఉండటంతో 23న వేలం రద్దు చేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. తేదీని ఇంకా కొంచెం ముందుకు జరపాలని కోరుతున్నారు. వారి కోరిక నెరవేరుతుందో లేక బీసీసీఐ తాను సూచించిన తేదీకే మొగ్గు చూపుతుందో తెలియదు. ఐపీఎల్ కోసం ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. జట్టును ముందుండి విజయతీరాలకు చేర్చే వారి కోసమే ఎదురు చూస్తున్నాయి. వేలంలో ఆటగాళ్లకు భారీగానే నజరానాలు దక్కనున్నట్లు సమాచారం.