Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకుంటారు. కానీ ఇదే శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు అమర్చుకోవాలి. కొందరు ఇల్లు చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ ఇంట్లో వారిని ఎప్పుడూ కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. డబ్బు నిల్వకుండా అధికంగా ఖర్చు అవుతుంది. వివాదాలు, ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని వాస్తు టిప్స్ పాటించడం వల్ల ఇంటిని సంతోషంగా మార్చుకోవచ్చు. జంతువుల్లో అత్యంత భారీ కాయం కలిగినది ఏనుగు. ఏనుగుకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రత్యేకత ఉంది. వినాయకుడు ఆవిర్భవించడానికి ఏనుగే కారణం. అందువల్ల ఏనుగు ను చాలా మంది దేవతలు ఇష్టపడుతూ ఉంటారు. లక్ష్మీదేవికి ఏనుగు అంటే చాలా ఇష్టం. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అనుకునేవారు ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే కొందరు వెండి ఏనుగులనుతయారు చేయిస్తారు. వీటిని ఏ ప్రదేశంలో ఉంచడం వల్ల మంచి జరుగుతుందో తెలుసుకుందాం..
అతిపెద్ద శరీరం కలిగిన ఏనుగు ఏంతో మృదు స్వభావి. అందువల్ల ఈ జంతువును చూసినప్పుడల్లా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏనుగు అంటే మహా విష్ణువుకు కూడా చాలా ఇష్టం. ఒక కథలో ఏనుగుకు ఆపద వచ్చిందంటే ఉన్న ఫలంగా వస్తాడని చరిత్ర చెబుతుంది. అలాగే లక్ష్మీదేవి చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచాలని అనుకునేవారు ఏనుగు బొమ్మలు ఉంటే ఇంకా మంచిది అని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ప్రత్యేకంగా వెండితో చేసిన ఏనుగులను ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఉంచుకోవచ్చు. ఎవరి ఇంట్లో అయితే ఏ విషయంలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
ఉదాహరణకు ఒక ఇంట్లోని పిల్లలు చదువుపై శ్రద్ధ చూపడం లేదనుకోండి. వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఇలాంటి సమస్యలు ఉన్న వారు వెండితో చేసిన ఏనుగు బొమ్మలను పిల్లల గదిలో ఉంచాలి. వీటితో పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. వారికి చదువుపై ఇష్టం పెరుగుతంది. అలాగే వెండి లోహం నుంచి వెలువడే శక్తితో ఆ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉండి పిల్లలు యాక్టివ్ గా ఉండగలుగుతారు.
నేటి కాలంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమస్య ఎక్కువగా ఉన్న వారు వెండి ఏనుగు బొమ్మలను బెడ్ రూముల్లో ఉంచాలి. ఇవి అక్కడ ఏర్పాటు చేయడం వల్ల దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. దీంతో ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఇవి ఉపకరిస్తాయి. అందువల్ల బెడ్ రూముల్లో వెండి ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోవాలి.
కొందరి ఇల్లు చూడ్డానికి పెద్దగా ఉంటుంది. కానీ మనుషుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇళ్లల్లో వెండి ఏనుగుల బొమ్మలను హాల్ లో ఉంచాలి. ఇవి ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సానుకూల పవనాలు వీస్తాయి. దీంతో మనుషుల మధ్య ఏలాంటి భేదాలు లేకుండా చేస్తాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.