Cars At Home: దూర ప్రయాణాలు చేయాలంటే ఒకప్పుడు బస్సులే ఆధారం. ఆ తర్వాత కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలకు ఎక్కువగా ఆశ్రయించేవారు. అయితే కాలం మారుతున్న కొద్ద ప్రయాణానికి అనుగుణంగా ఉండే కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అనుకున్న ప్రదేశాలకు సమయానికి చేరుకోవాలంటే ప్రత్యేక వాహనాలను అద్దెకు తీసుకొని వెళ్లేవారు. అయితే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే ప్రతీసారి అద్దెకు కారు తీసుకుని వెళ్లడం వల్ల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో వీకెండ్ లేదా మంథ్ ఎండ్ లో ఏదైనా షికారు చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సొంతంగా కారులు ఉండాలని కోరుకుంటున్నారు. సొంతంగా కారు ఉండడం వల్ల ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలకు వెళ్లొచ్చు అయితే ఇలా సరదాగా ఉండేందుకు కారు కొనాలని చూసేవారు తక్కువ ధరతో పాటు మైలేజ్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి వారి కోసం మార్కెట్లో కొన్ని కాళ్లు అందుబాటులో ఉన్నాయి అవి కాళ్లు అంటే..?
దేశంలో అత్యధిక కార్లు అమ్మే కంపెనీ ఏదంటే మారుతి సుజుకీ కంపెనీ గురించి మొదటగా చెబుతారు. ఈ కంపెనీ బడ్జెట్ కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో ముందు ఉంటుంది అని అంటారు. ఈ కంపెనీ కార్లు తక్కువ ధరలో ఉండడమే కాకుండా అత్యధిక మైలేజ్ ఇచ్చే ఇంజన్లు కలిగి ఉంటాయి. మారుతి కంపెనీ కి చెందిన వ్యాగన్ఆర్ ఆటోమోబైల్ వ్యాప్తంగా నెంబర్ వన్ కారుగా నిలుస్తూ ఉంటోంది. వ్యాగన్ఆర్ కారు పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 24.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. CNG ఆప్షన్లో 34.05 కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఆటోమేటిక్ తో పాటు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉన్న ఈ కారు చిన్న ఫ్యామిలీ లాంగ్ డ్రైవ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది.
ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా SUV వేరియంట్ లో బెస్ట్ కారుగా పేరు తెచ్చుకుంది. 7 సీటర్ ఉండే ఈ కారులో 1.5 లీటర్ 3 సిలిండర్ హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ పై 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది కూడా పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 22.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ ఆప్షన్లో 30.61 కిలోమీటర్ల వరకు వెళుతుంది.
మారుతి S-PRESSO కారు సైతం పెట్రోల్ వేరియంట్ లో 24.12 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తోంది. ఇదే కారు సీఎన్జీలో 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం దీనిని 4.26 లక్షల ప్రారంభ ధర నుంచి 6.12 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మారుతి కంపెనీకి చెందిన ఆల్టో K 10 కారు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. దశాబ్దాలుగా ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కారు పెట్రోల్ తో పాటు సిఎన్జి ఆప్షన్ లో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఆప్షన్ లో 24.39 కిలోమీటర్ల వరకు వెళ్తుంది సీఎన్జీలో 33.85 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తోంది. దీనిని ప్రస్తుతం 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి 5.96 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు.