Homeలైఫ్ స్టైల్Lizards: ఇంట్లో బల్లులా.. తరిమికొట్టే శాశ్వత పరిష్కారం ఇదీ!

Lizards: ఇంట్లో బల్లులా.. తరిమికొట్టే శాశ్వత పరిష్కారం ఇదీ!

Lizards
Lizards

Lizards: బల్లులను చూడగానే మనలో చాలా మందికి చికాకు, విసుగును కలిగిస్తాయి. బల్లులు ఇంటిలో క్రిమి కీటకాలను తిని వాటి బెడద తగ్గించినా సరే బల్లులు ఎక్కువగా ఇంటిలో ఉంటె చాలా ఇబ్బందిగా ఉంటుంది. బల్లులను తరిమి కొట్టటానికి మార్కెట్‌లో బల్లి నిరోధకాలు అందుబాటులో ఉంటాయి. అయితే వీటి కారణంగా చిన్న పిల్లలకు హాని కలగవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చిన్నచిన్న చిట్కాలతో బల్లులను శాశ్వతంగా ఇంటి నుంచి తరిమేయవచ్చు. ఈ చిట్కాలకు ఉపయోగపడే అనిరకాల వస్తువులు మన ఇంట్లో ఉండేవే.

కాఫీ, పొగాకు మిక్స్‌..

కాఫీ పొడిలో పొగాకు పొడి కల్పి చిన్న చిన్న బంతులుగా తయారుచేసి, టూత్‌ పిక్స్‌ తీసుకుని ఆ బంతులకు ఫిక్స్‌ చేయాలి. ఈ టూత్‌ పిక్స్‌ను బల్లి మార్గం లేదా బల్లులు ఉండే ప్రదేశాల్లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు తింటే చనిపోతాయి. కాఫీ వాసన బల్లులను ఆకర్షిస్తుంది.

Also Read: Junior NTR- Ram Gopal Varma: జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్ పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

నాఫ్తలిన్‌ బాల్స్‌..

నాఫ్తలిన్‌ బంతులు మంచి పెస్ట్‌ కంట్రోలర్‌ అని చెప్పవచ్చు. నాఫ్తలిన్‌ బంతులను మీ వార్డ్‌ రోబ్‌లో, నీటి సింక్‌లో లేదా స్టవ్‌ కింద లేదా బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పెట్టాలి. వీటి వాసన బల్లులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాఫ్తలిన్‌ బంతుల వాసనకు బల్లులు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

నెమలి ఈకలు

నెమలి ఈకలను చూసి బల్లులు భయపడతాయి. అందువల్ల బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో గోడలపై అక్కడక్కడ నెమలి ఈకలను అంటిస్తే బల్లులు పారిపోతాయి. అలాగే నెమలి ఈకలను ఫ్లవర్‌ వాజ్‌ లలో కూడా పెట్టవచ్చు.

Lizards
Lizards

పెప్పర్‌ స్ప్రే..

మిరియాలను మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిలో నీటిని కలిపి ద్రావణంగా తయారుచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని స్ప్రై బాటిల్‌లో పోసి వంటగది అరలు, ట్యూబ్‌ లైట్‌ మూలలు, స్టవ్‌ క్రింద, బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో పిచికారీ చేయాలి. మిరియాలులో ఉండే ఘాటుకి బల్లులు పారిపోతాయి.

ఐస్‌ వాటర్‌

బల్లుల మీద ఐస్‌ వాటర్‌ పిచికారీ చేయాలి. ఒక్కసారిగా చల్లని నీరు పడటంతో దాని శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన, బల్లి కదలటానికి కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక కార్డు బోర్డు బాక్స్‌లో బల్లిని ఉంచి మీ ఇంటి నుంచి బయటకు వేసేయండి.

ఉల్లిపాయ

గోడకు వ్యతిరేకంగా ఉల్లిపాయ ముక్కలను ఉంచండి. అలాగే బల్లులు దాగి ఉన్న ప్రదేశాల్లో ఉల్లిపాయ ముక్కలను ఉంచండి.ఉల్లిపాయలో సల్ఫర్‌ సమ్మేళనం ఉండడంతో ఒక రకమైన చెడు వాసనను సృష్టిస్తుంది. ఈ వాసనను తట్టుకోలేక బల్లులు ఇంటి నుంచి పారిపోతాయి.

వెల్లుల్లి పేస్ట్‌..

వెల్లుల్లిని మెత్తని పేస్ట్‌గా చేసి నీటిలో కలిపి ద్రావణంగా తయారుచేయాలి. ఈ ద్రావణాన్ని స్ప్రై బాటిల్‌లో పోసి బల్లులు ఉన్న ప్రదేశంలో పిచికారీ చేయాలి. వెల్లుల్లి ఘాటుకి బల్లులు ఇంటి నుంచి బయటకు పోతాయి.

Also Read: Anil Kapoor : దొంగతనాలు చేసే స్థాయికి దిగజారిపోయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version