Facebook: మనలో చాలామంది ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా దిగ్గజాలలో ఫేస్ బుక్ కూడా ఒకటి కాగా ఫేస్ బుక్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియా వాడకం గురించి అవగాహనను కలిగి ఉండటంతో పాటు టెక్నికల్ స్కిల్స్ ఉంటే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు.

చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్ లైన్ సర్వేల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని భావిస్తూ ఫెయిల్ అవుతుంటారు. ఫేస్ బుక్ లో ఉండే మనీ ఎర్నింగ్ టూల్స్ సహాయంతో సులభంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్లు ఫేస్ బుక్ సహాయంతో ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ ఉత్పత్తులతో పాటు వంట సామాగ్రి, గ్యాడ్జెట్లను సులభంగా సంపాదించుకోవచ్చు.
ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్ సహాయంతో కూడా సులువుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఫ్యాన్ పేజ్ ద్వారా డబ్బులను సంపాదించాలని భావిస్తే కనీసం సంవత్సరం సమయం పడుతుంది. ఏదైనా రంగంపై అవగాహనను కలిగి ఉన్నవాళ్లు ఫేస్ బుక్ ఫ్యాన్ పేజీ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూజర్లకు నచ్చే కంటెంట్ ను పోస్టర్ల రూపంలో డిజైన్ చేయడం ద్వారా డబ్బులను సంపాదించే అవకాశం ఉంటుంది.
రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయడం ద్వారా యూజర్లు సులభంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పేజ్ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా డబ్బులను సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. హెల్త్ కేర్ ప్రతినిధులను సంప్రదించడం ద్వారా పెయిడ్ మార్కెటింగ్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది.