https://oktelugu.com/

Train Mileage : రైలు మైలేజీ ఎంతో తెలుసా.. లీటర్‌ డీజిల్‌తో ఎన్ని కిలోమీటర్ల వెళ్తుందంటే..

12 కోచ్‌లను లాగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కిలోమీ దూరం ప్రయాణించడానికి 4.5 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఒక లీటర్‌ డీజిల్‌తో 230 మీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇక ప్యాసింజర్‌ రైళ్లు సుమారు 180–200 మీటర్లు ప్రయాణించగలవు.

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2024 12:18 pm
    train mileage

    train mileage

    Follow us on

    Train Mileage : భారత దేశంలో సామాన్యుల ప్రధాన రవాణా వ్యవస్థ రైల్వే. నిత్యం 2.3 కోట్ల మంది రైళ్లతో ప్రయాణం సాగిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ కలిగిన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో బొగ్గు ఇంజిన్ల నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్ల వరకు రైళ్లు ఉన్నాయి. బొగ్గు ఇంజిన్లు ఇప్పుడు కనుమరుగయ్యాయి. డీజిల్‌ ఇంజిన్లు ఇంకా కొనసాగుతున్నాయి. విద్యుదీకరణ పూర్తికాని మార్గాల్లో డీజిల్‌ ఇంజిన్లతోనే రైళ్లు నడుస్తున్నాయి. అయితే డీజిల్‌ ఇంజిన్‌ రైలు మైలేజీ ఎంత అన్న విషయం ఎవరికీ తెలియదు. మనం బైక్, కారు కొన్నప్పుడు మైలేజీ చూస్తాం. కానీ రైలు మైలేజీని ఎవరూ పట్టించుకోరు. లీటర్‌ డీజిల్‌తో రైలు ఎంత దూరం నడుస్తుందో తెలుసుకుందాం.

    నిత్యం కోట్ల మంది రవాణా సాధం..
    రైల్వే నిత్యం కోట్ల మంది భారతీయులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే చాలా మందికి రైళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలియదు. ఆలోచన కూడా చేయరు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న బోర్డుపై సముద్ర మట్టానికి స్టేషన్‌ ఎత్తు ఎందుకు రాసి ఉంటుంది. రైలు కంపార్ట్‌మెంట్‌ వెనుక గీ గుర్తు ఎందుకు ఉంది? 1 లీటర్‌ డీజిల్‌తో రైలు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది వంటి మనకు తెలియని ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి.

    మైలేజీ ఇలా..
    మైలేజీ అనేది వాహనం ఇంధన సామర్థ్యానికి సంబంధించినది. అంటే ఒక లీటర్‌ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది అని తెలియజేస్తుంది. అన్ని వాహనాల మాదిరిగానే రైలు మైలేజీ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక రైలు లీటరుకు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మైలేజీ మార్గం, ప్యాసింజర్‌ రైలు రకం, ఎక్స్‌ప్రెస్, హైస్పీడు, ప్యాసింజర్, అది తీసుకెళ్లే కోచ్‌లను బట్టి మారుతుంది.

    గంట ప్రాతిపదికన లెక్కింపు..
    రైలు మైలేజీని ప్రభావితం చేసే అతి పెద్ద అంశం దానికి ఎన్ని కోచులు ఉన్నాయన్నది. పెట్టెల సంఖ్య తక్కువగా ఉంటే.. యంత్రం తక్కువ లోడ్‌ను లాగగలదు. అందుకే డీజిల్‌ ఇంజిన్‌ మైలేజ్‌ గంట ప్రాతిపదికన లెక్కించబడుతుంది. 24–25 కోచ్‌ రైళ్ల ఇంజిన్‌ కిలోమీటర్‌ కి 6 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుందని నివేదికలు తెలిపాయి. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ప్యాసింజర్‌ రైళ్ల కంటే తక్కువ డీజిల్‌ వినియోగిస్తాయి. ప్యాసింజర్‌ రైలు లోకోమోటివ్‌లు ప్రతీ కిలోమీటర్‌ కి 5–6 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తాయి. అన్ని స్టేషన్లలో ప్యాసింజర్‌ రైళ్లు ఆగాల్సి రావడం కూడా ఇందుకు కారణం. 12 కోచ్‌లను లాగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు కిలోమీ దూరం ప్రయాణించడానికి 4.5 లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఒక లీటర్‌ డీజిల్‌తో 230 మీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇక ప్యాసింజర్‌ రైళ్లు సుమారు 180–200 మీటర్లు ప్రయాణించగలవు.