Lying : అబద్ధాలు చెప్పే వ్యక్తులు వారు చెప్పే స్టోరీలు నేరుగా చెప్పలేరు. అదే ప్రశ్నను తర్వాత అడిగినప్పుడు మరో స్టోరీ వస్తుంది. ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక వారు మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. అబద్ధం చెప్పే వ్యక్తికి వారు చెప్పేదానికి, వారి బాడీ లాంగ్వేజ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి “లేదు” అని తలను ఊపే విధానమే తెలుపుతుంది. మీతో మాట్లాడే పర్సన్ వివరణ ఏ విధంగా ఉంది. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నా సరే ఆయన చెప్పేది నిజమా? అబద్దమా అని తేలిపోతుంది.
మాట్లాడుతూ మాటల మధ్యలో తడబడటం, లేదంటే విరామం తీసుకోవడం, ఆగి ఆగి మాట్లాడటం, సమాధానాలు పొంతన లేకపోవడం వంటివి చెబుతుంటే కచ్చితంగా అబద్ధం చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కొంత మంది అబద్ధాలు సమాధానం చెప్పే ముందు ప్రతి సారి ప్రశ్నను చెబుతుంటారు. ఆలోచించడానికి సమయం ఎక్కువ తీసుకుంటారు.
ఐ కాంటాంక్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. మనిషిని చూస్తూ మాట్లాడలేరు. ఐ కాంటాక్ట్ ఇస్తూ అబద్ధం చెప్పడం చాలా కష్టమేనండోయ్. అందుకే మాట్లాడుతున్నప్పుడు వారి కండ్లు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి గమనించండి. మిమ్మల్ని చూడాలన్నా, చూస్తూ మాట్లాడాలన్నా భయపడుతూ ఇబ్బంది పడుతున్నారంటే కచ్చితంగా అబద్ధం చెబుతున్నారని మీనింగ్.ఇక వ్యక్తుల బాడీ లాంగ్వేజ్‌ని నిశితంగా గమనించండి. వారు అబద్ధం చెబుతున్నారో లేదో తెలుసుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో వారు, అబద్దం చెబుతున్నప్పుడు వారు అనే తేడా గమనించండి.
ఏదైనా అడిగితే వారు సరైన సమాధానం చెప్పరు. అది మానేసి ఇతర మాటలు మాట్లాడుతుంటారు. లేదంటే దాన్ని దాట వేసే ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే ఇతరులు నమ్మేలా వివరిస్తుంటారు. వివరాలు ఇచ్చే సమయంలో వారి మాటలను అర్తం చేసుకుంటే అబద్ధం చెబుతున్నారా లేదా అని నిర్ధారించుకోవచ్చు. వారి మాటలు ఖండిస్తూ మీరు ఎదురు దాడి చేస్తున్నారని, వారి మాటలు నమ్మడం లేదని కాస్త అర్థం అయినా సరే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. లేదంటే వారి ఫేస్ లో కదలికలు కూడా ఛేంజ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎవరైనా “నిజాయితీ” లేదా “నిజం చెప్పడం” వంటి పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే వారు నిజాయితీగా ఉన్నారని మిమ్మల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నట్టు. నిజానికి వారు అబద్దమే చెబుతున్నట్టు.