https://oktelugu.com/

Best Cars: ఎక్కువ మైలేజ్.. తక్కువ ధర.. అమ్మకాల్లో దూసుకుపోతున్న ఈ 5 కార్లు.. వెంటనే తెలుసుకోండి..

దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ వేరియంట్లను తీసుకొచ్చిన మారుతి తక్కువ ధరకే మోడళ్లను అందిస్తుంది. ఈ కంపెనీ నుంచిరిలీజ్ అయినా సెలెరియా అమ్మకాల్లో టాప్ 1 ప్లేసును ఆక్రమించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2023 / 01:35 PM IST

    Best Cars

    Follow us on

    Best Cars: కారు కొనాలనుకునేవారు ముందుగా మైలేజ్ ను చూస్తారు.. ఆ తరువాత ధర గురించి ఎంక్వైరీ చేస్తారు. కంపెనీలు సైతం వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో 5 మోడళ్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పెట్రోల్ ఫ్యూయల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్లో సమర్థవంతమైన ఇంజిన్ ను కలిగిన ఈ మోడళ్లు అమ్మకాల్లో టాప్ 5 గా నిలిచాయి. ధర కూడా తక్కువగానే ఉండడంతో ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ 5 కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా?

    దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు వివిధ వేరియంట్లను తీసుకొచ్చిన మారుతి తక్కువ ధరకే మోడళ్లను అందిస్తుంది. ఈ కంపెనీ నుంచిరిలీజ్ అయినా సెలెరియా అమ్మకాల్లో టాప్ 1 ప్లేసును ఆక్రమించింది. 1.0 లీటర్ పెట్రోల్ నేచురల్ అస్పిరేటెడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కారు లీటర్ కు 24.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.36 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన మరో మోడల్ ఎస్ఉ-ప్రెస్సో. ఈ మోడల్ 1.0 లీటర్ సహజమైన అస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.4.26 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీ నుంచి రిలీజ్ ఆకట్టుకుంటున్న సరికొత్త మోడల్ స్విప్ట్. స్విప్ట్ ను ఇప్పటికే చాలా మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు. 1.2 లీటర్ పెట్రలో తో పాటు 4 సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కారు లీటర్ కు 22.56 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.99 లక్షల ఎక్స్ షో రూం ధరతో విక్రయిస్తున్నారు.

    రెనాల్ట్ నుంచి రిలీజ్ అయిన ఓమోడల్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే క్విడ్. ఫ్రెంచ్ ఆటోమేకర్ అయిన ఈ కారుకు భారత్ వినియోగదారులు ఫిదా అయ్యారు. 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు 3 సిలిండర్ నేచురల్ ఇంజిన్ ను కలిగిన ఈ మోడల్ లీటర్ కు 22.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.4.69 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు.