Reduce To Hiccups: ఎక్కిళ్లు అనేవి ప్రతి మనిషికి వస్తాయి. అయితే, ఎక్కిళ్లు ఎక్కువగా వస్తే.. అనారోగ్యం కూడా వస్తోంది. కాబట్టి ఎక్కిళ్లు ఎక్కువ సార్లు రాకుండా జాగ్రత్త పడాలి. మరి ఎక్కిళ్లు నివారణకు బెస్ట్ మార్గాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి.

ఎక్కిళ్లు వస్తున్నప్పుడు.. పంచదారను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి. అలాగే, మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకున్నా ఎక్కిళ్ళు పోతాయి. నేల ఉసిరి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిళ్లు నిలిచిపోతాయి. అదే విధంగా పిచ్చితాటాకు నమిలి ఊటను మింగితే ఎక్కిళ్లు పోతాయి.
మీకు తెలుసా ? జామ కాయను తిన్నా ఎక్కిళ్లు పోతాయి. శొంఠి తీసుకుని చెంచాడు తేనును కలిపి చప్పరిస్తే చాలు.. ఇక ఎక్కిళ్లు పోతాయి. అదే విధంగా శొంఠి , ఉసిరి పలుకు వీటన్నింటిని సమ భాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజు రెండు పూటలా తింటే చాలు.. దెబ్బకు మీకు ఎక్కిళ్లు ఇక రావు.

అసలు ఎక్కిళ్ళు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసా ? విటమిన్ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అలా తింటే.. మీరు ఎక్కిళ్ళను నియత్రించొచ్చు. ఎక్కిళ్ళు తగ్గడానికి మరో బెస్ట్ మార్గం ఏమిటో తెలుసా ? ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యమైన వార్తను చెప్పాలి. వెంటనే ఎక్కిళ్లు పోతాయి.
[…] Megastar Chiranjeevi: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆయన అభిమానులు, ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆయన ఫాలోవర్స్ ఆందోళన చెందుతూ ఆయన హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. […]