Akhil Shocking Decision: స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని నట వారసుడు అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం ఓ భారీ వేడుకను కూడా సిద్ధం చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడానికి.. ఈ ట్రైలరే మెయిన్ కానుంది.

అందుకే.. ఏజెంట్ ట్రైలర్ పై అఖిల్ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఏజెంట్ సినిమాకి 40 కోట్ల బడ్జెట్ అయ్యింది. అఖిల్ కి అంత మార్కెట్ లేదు. ఇప్పుడు సినిమాకి మార్కెట్ కావాలి అన్నా.. ఏజెంట్ ట్రైలర్ రికార్డు వ్యూస్ ను తెచ్చుకోవాలి. అందుకే.. పెయిడ్ ప్రమోషన్స్ కోసం కూడా టీమ్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టింది. 24 గంటల్లోనే కనీసం 5 మిలియన్ల వ్యూస్ దాటేలా పెయిడ్ ప్రమోషన్స్ చేయబోతున్నారు.
ఇక ఈ ఏజెంట్ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో దర్శనమివ్వనున్నాడు. ఇన్నాళ్లు అఖిల్ ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు.

కానీ, ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి ఏజెంట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. పైగా ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా బాడీని పెంచాడు.
కండలు తిరిగిన దేహంతో ఒళ్ళు విరుచుకుంటూ అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అందుకే, అఖిల్ కష్టాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తాడట సురేందర్ రెడ్డి. కానీ, మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో ‘సైరా’ తీసిన సురేందర్ రెడ్డి, ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు.
మరి, ఇప్పుడు అఖిల్ పై కూడా భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్న సురేందర్ రెడ్డి.. ఈ సినిమాతో ఏమి చేస్తాడో చూడాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.