
Stress Relievers Food: మనం జీవితంలో ఒత్తిడికి గురవుతాం. దీంతో రోగాల బారిన పడుతుంటాం. ఒత్తిడిని జయించకపోతే వ్యాధులు దరి చేరడం ఖాయం. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారాలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. మనం తినే ఆహరంలో ఉండే పోషకాలతో మనకు వ్యాధుల ముప్పు తప్పుతుంది. ఒత్తిడిని నియంత్రించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. కొన్ని రకాల ఆహారాలు ఒత్తిడిన పెంచే కార్డినాల్ అడ్రినలిన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ హార్మోన్లు దీర్ఘకాలిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి. దీనికి గాను మనం తీసుకునే ఆహారాలేంటో తెలుసుకుంటే వాటిని తీసుకోవడం వల్ల ఫలితం వస్తుంది.
నారింజ
నారింజలో విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. విటమిన్ సి ని తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. కార్డినాల్ స్థాయిలు చాలా త్వరగా సాధారణ స్థితికి చేరతాయి. బ్లాక్ టీ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి బయట పడతారు. ఇతర టీలతో పోల్చుకుంటే బ్లాక్ టీలో ఔషధ గుణాలు మెండుగా ఉండటం వల్ల దీన్ని తాగడం ఆరోగ్యానికి మంచిదే అని చెబుతున్నారు.
విటమిన్ బి లబించే..
విటమిన్ బి లభించే ఆహారాల్లో గొడ్డు మాంసం, కోడి మాంసం, గుడ్లు, తృణ ధాన్యాలు, అవకాడో లాంటివి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా చేస్తాయి. మెగ్నిషియం అధికంగా లభించే వాటి వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. కార్డినాల్ హార్మోన్ ను తగ్గించడానికి సాయపడుతుంది. అవకాడో, బ్రోక్ లీ, అరటిపండ్లు, గుమ్మడికాయ గింజలు, బచ్చలి కూరలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

చిలగడదుంపలు
చిలగడదుంపలు కూడా మంచి ఆహారమే. ఇందులో ఉండే పోషకాలతో ఒత్తిడి లేకుండా పోతుంది. దీర్ఘకాలిక ఒత్తిడిని కలిగించే అవకాశం లేకుండా కార్టిసాల్ పనిచేయకపోవడానికి దారి తీస్తుంది. ఇది మంట, నొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తుంది. కోడిగుడ్డులో కూడా మంచి పోషకాలు ఉంటాయి. మల్టీ విటమిన్ ఫుడ్ అని దీన్ని పిలుస్తారు. రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు తింటే ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఒత్తిడిని జయించొచ్చు.
ఈ నేపథ్యంలో ఒత్తిడిని దూరం చేసే వాటిని తీసుకుంటే మనకు ఆరోగ్యం చేకూరుతుంది. పైన చెప్పిన వాటిని తీసుకుని మన శరీరానికి ఒత్తిడి రాకుండా చేసుకోవచ్చు. దీనికి గాను మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరానికి నష్టం తీసుకొచ్చే వాటిని తీసుకోకుండా లాభం చేకూర్చే వాటిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలి.