Dreams : చాలా మందికి కలలు వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కలలు రావడం కామన్. కానీ వేరు వేరు కలలు వస్తాయి. ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే చాలా కలలు నిజ జీవితంలో చాలా ప్రభావాలను చూపిస్తాయి అంటున్నారు పండితులు. ఇక స్వప్న శాస్త్రంలోనూ ఇందుకు సంబంధించిన వివరాలను చాలా ఉన్నాయి. మనకు వచ్చే కలలో కొన్ని భయపెడితే కొన్ని హాయిగా అనిపిస్తాయి. మంచి అనుభూతితో పాటు అలా జరిగితే బాగుండు కదా అనిపిస్తాయి. అయితే ఇలా వచ్చే ప్రతీ కలకు ఒక్కో అర్థ ఉంటుంది అంటుంది స్వప్న శాస్త్రం. అయితే చాలా మందికి చెడు కలలు వస్తాయి. ఇలా వచ్చే ప్రతి చెడు కలకు చెడు సంకేతం కాదు అని అంటుంది స్వప్న శాస్త్రం. మరి అలాంటి కలలు వస్తే ఏం జరుగుతుందో చూసేద్దాం.
అదృష్టాన్ని తెస్తాయి.
మనకు వచ్చే కొన్ని కలలు మన ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తాయట. రాత్రి పడుకునే సమయంలో మనకు కినిపించే కొన్ని అంశాలు చాలా విషయాలను తెలుపుతాయి. ఇవి నిజ జీవితంలో మన వ్యక్తిగత అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయట. అయితే కొన్ని కలలు నచ్చకపోయినా సరే మంచి చేస్తాయట. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో వచ్చే కొన్ని కలలు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అంటున్నారు పండితులు.
కొత్త నోట్లు: కలలో ఎవరికైనా కొత్త నోట్లు కనిపిస్తే చాలు ఇది చాలా శుభసూచకం. చాలా కాలంగా ఎదుర్కొంటున్న మీ ఆర్థిక సమస్యలకు ఇక చెక్ పడబోతుంది అని అర్థం. కలలో నాణేలు కనిపించినా చాలా మంచిది అంటారు పండితులు. ఇక మీకు గనుక బంగారు నాణేలు కనిపిస్తే మరింత లక్కీ మీరు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది అని అర్థం. అంతేకాదు ఇలాంటి కలలు మీకు వస్తే మీ అప్పులు తీరబోతున్నాయని అర్థం.
లక్ష్మీ దేవిని చూస్తే..
ఒకవేళ కలలో లక్ష్మీ దేవీ కనిపిస్తే మీరు చాల లక్కీ. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలకు తెర పడట్టే. మంచి సమయం మీకోసం ఎదురు చూస్తుందని అర్థం. ఇక కేవలం ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే కాదు మరిన్ని సమస్యలు కూడా తీరతాయి. మానసిక, కుటుంబ సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి.
అన్నీ పోగొట్టుకున్నట్లు వస్తే.
సాధారణంగా అన్నీ పోగొట్లుకున్నట్లు కొన్ని సార్లు నెగటివ్ కలలు కూడా వస్తాయి. అయితే ఇలా వస్తే కూడా చాలా మంచిది. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం కలలో సర్వసం కోల్పోయినట్లు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుంది అని అర్థం చేసుకోవాలి.