friendship day quotes :ఈ సృష్టిలో అందమైన బంధం స్నేహం. జీవితాంతం తోడు ఉండే ఒక వ్యక్తి స్నేహితుడు మాత్రమే. అయితే మంచి స్నేహంతో ఉల్లాసంగా ఉంటుంది. చెడు స్నేహంతో జీవితం నాశనం అవుతుంది. అందువల్ల స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు స్నేహితుల్లాగానే నటిస్తూ మోసం చేసేవారు కూడా ఉంటారు. మరికొందరు తమ ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితుడి కోసం సహాయం చేస్తారు. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అయితే నేటి కాలంలో స్నేహితులు కలుసుకోవడానికి తీరిక ఉండడం లేదు. దీంతో ప్రతి ఏడాది ఆగస్టు 5న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల్లో ఉండేవారు విషెస్ ను ఆన్లైన్లోనే చెబుతూ ఉంటారు. ఇలాంటివారు సాధారణంగా కాకుండా మంచి కొటేషన్ తో చెప్పడం వల్ల ఎదుటివారిని ఆకోట్టుకోగలుగుతారు. మరి మంచి కొటేషన్లు మీకోసం..

జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా స్నేహం మాత్రం మనతోనే ఉంటుంది… స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
ఈరోజు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో.. మన స్నేహం కూడా అంతే ప్రకాశవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నా..Happy Friendship Day
కొన్ని స్నేహాలకు పదాలు అవసరం లేదు.. అవి నిశ్శబ్దంగానే అనుభూతి చెందుతాయి.. అలాంటి అరుదైన బంధం నీతో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా.. Happy Friendship Day
కాలం ఏదైనా.. అందుకు అనుగుణంగా సాయం చేసే వ్యక్తి నిజమైన స్నేహితుడు..Happy Friendship Day
స్నేహం అనేది ఒక సీజన్ కాదు.. లోతుగా అల్లుకుపోయే వేర్లు.. ఇవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరం వెళ్లినా.. మన జ్ఞాపకాలు అలాగే పదిలంగా ఉండాలని కోరుకుంటూ.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్నేహం విశాలమైన ఆకాశంలో విహరించాలని.. అర్ధమైన నక్షత్రంలా ఉండిపోవాలని కోరుకుంటూ.., Happy Friendship Day
స్నేహాలు మన జీవితాలలో కథల అధ్యాయాలు కావాలి. ప్రేమతో నిండి ఉండాలి..Happy Friendship Day
నీ స్నేహం అనే పాట నా మదిలో ఎప్పుడూ పాడుతూనే ఉంటుంది.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
నీ స్నేహం ఎంతో మధురమైనది.. మేఘావృతమైన రోజులను కూడా ప్రకాశవంతంగా చేసేలా ఉంటుంది.. happy Friendship Day.
నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకొని.. నేను చెప్పే మాటలు విని.. నాకు ఎంతో సాయం చేసిన నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
స్నేహం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు.. జీవితానికి మార్గదర్శకాన్ని చూపిస్తుంది.. అలాంటి స్నేహం నీతో ఉన్నందుకు కృతజ్ఞతలు.. ఈ సందర్భంగా నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
సవాళ్లను.. సాహసాలను.. కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చే శక్తి స్నేహానికి మాత్రమే ఉంటుంది.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
ఈ స్నేహితుల దినోత్సవం రోజున.. ప్రేమతో నిండిన నీ మనసుతో గడపాలని కోరుకుంటూ.. happy Friendship Day.
నా జీవితాన్ని రంగులమయం చేసిన నీ స్నేహానికి ఎంతో కృతజ్ఞతలు.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.