https://oktelugu.com/

Green Tea: గ్రీన్ టీ ఇలా తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

చాలా మంది గ్రీన్‌ టీ తాగేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి ఈ గ్రీన్ టీ విషయంలో కొందరు చేసే ఆ తప్పులేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2024 5:28 pm
    green tea

    green tea

    Follow us on

    Green Tea: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. దీన్ని తాగడం వల్ల ఫిట్‌గా ఉంటారని భావిస్తారు. ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువగా గ్రీన్ టీని తాగుతుంటారు. ఈ టీని తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని భావిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే దీనివల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డైలీ ఈ గ్రీన్ టీని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే చాలా మంది గ్రీన్‌ టీ తాగేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరి ఈ గ్రీన్ టీ విషయంలో కొందరు చేసే ఆ తప్పులేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ఖాళీ కడుపుతో అసలు తాగకూడదు
    గ్రీన్‌టీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఉదయం ఖాళీ కడుపుతో అసలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనివల్ల మలబద్ధకం, యాసిడ్‌ను కలిగించే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తాగితే పర్లేదు. కానీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఏదైనా తిన్న తర్వాత ఈ గ్రీన్ టీ తాగడం ఉత్తమం.

    ఎక్కువసార్లు తాగకూడదు
    కొందరు తొందరగా బరువు తగ్గాలని రోజుకి ఎక్కువసార్లు తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల ఆందోళన, చిరాకు, నిద్రలేమి సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి 5 సార్లు కంటే ఎక్కువగా తాగితే తప్పకుండా వ్యాధుల బారిన పడతారు. రోజుకి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే గ్రీన్ టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంత కంటే తక్కువ తీసుకున్న పర్లేదు. గ్రీన్ టీ తాగుతూ.. వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతారు. లేకపోతే తొందరగా బరువు తగ్గుతారని చెప్పలేం.

    తిన్న వెంటనే గ్రీన్ తాగవద్దు
    కొందరు ఏదైనా తిన్న వెంటనే గ్రీన్ తాగుతుంటారు. ఉదాహరణకు ఉదయం టిఫిన్ చేసిన వెంటనే తాగవద్దు. కొంత సమయం తర్వాత గ్రీన్ టీ తాగాలి. రోజులో ఏ సమయంలో తీసుకున్న కూడా తిన్న వెంటనే తాగకపోవడం ఉత్తమం. అయితే గర్భిణులు, బాలింతలు, ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగకపోవడం ఉత్తమం. ఈ టీ తాగడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తాగాలి అనుకుంటే వైద్యుని సూచనలు తీసుకున్న తర్వాత తాగడం మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేసిన కూడా కొందరికి అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. కాబట్టి గ్రీన్ టీ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.