Garikapati Narasimha Rao: ప్రవచన కారుడిగా, వేదాలు ఉపనిషత్తుల మీద విపరీతమైన పట్టు ఉన్న వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలలో గరికపాటి నరసింహారావు సుప్రసిద్ధుడు. అలవోకగా వేదాల గురించి చెప్పగలరు. పురాణాల గురించి వివరించగలరు. ఉపనిషత్తుల గురించి మాట్లాడగలరు. అందువల్లే ఆయన అంటే చాలామంది అభిమానిస్తారు. ఆయనను ప్రవచనకారుడిగా గౌరవిస్తారు. జీవితం గురించి.. జీవనం గురించి.. విలువల గురించి నరసింహారావు చెబుతూ ఉంటారు. మంచి జీవితానికి పురాణాలతో ముడిపెడుతూ అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. యూట్యూబ్లో ఆయన ప్రసంగాలకు విపరీతమైన పాపులారిటీ ఉంది.
Also Read: వివాదంలో గరికపాటి.. టార్గెట్ చేసిన సోషల్ మీడియా.. అసలేమైందంటే?
ఎంతో విద్వత్తు ఉన్న గరికపాటి నరసింహారావు జీవితం లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రవచన కారుడిగా.. గొప్ప వ్యక్తిగా పేరుపొందిన ఆయన జీవితంలో అనేక మకిలీలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆయన మొదటి భార్య గరికపాటి కామేశ్వరి వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. అయితే ఈ వీడియోను ఓ పార్టీకి చెందిన వ్యక్తులు సర్కులేట్ చేస్తూ ఉండడం విశేషం.
Also Read: చిరంజీవి.. ఆ ఆడవాళ్లతో ఫొటోసెషన్ ఆపేయ్.. లేకపోతే నే వెళ్లిపోతా.. హర్ట్ అయిన గరికపాటి
నరసింహారావు కామేశ్వరి అనే మహిళకు బలవంతంగా విడాకులు ఇప్పించారట. ఆ తర్వాత ఆమెను ఎత్తుకొచ్చారట. ఆమెను వివాహం చేసుకొని.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బయటకు గెంటేశారట. పిల్లల భవిష్యత్తు కోసం ఆమె గత పాతిక సంవత్సరాలుగా నరసింహారావు పెడుతున్న ఇబ్బందులు మొత్తం పడుతున్నారట. అతని వల్ల ఆమె తన జీవితాన్ని మొత్తం కోల్పోయారట. కామేశ్వరిని బయటికి పంపించిన తర్వాత నరసింహారావు మరో వివాహం చేసుకున్నారట. నరసింహారావు స్త్రీ ద్వేషి అని కామేశ్వరి చెబుతున్నారు.. ఆయన స్త్రీలను ఏమాత్రం గౌరవించరని.. ఆయన దంతా పురుష భావజాలం అని కామేశ్వరి ఆరోపిస్తున్నారు. నరసింహారావు తన ఏకపక్ష విధానాలతో కామేశ్వరికి జీవితం అనేది లేకుండా చేశారట. కామేశ్వరి నరసింహారావు గురించి ఎప్పుడు మాట్లాడారో తెలియదు.. ఇన్నాళ్లపాటు నిశ్శబ్దంగా ఉన్న ఆమె మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. మరి దీనిపై నరసింహ రావు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.
నా భర్త ఒక స్త్రీ సైకో
– గరికిపాటి నరసింహారావు మొదటి భార్య వెల్లడించిన సంచలన వాస్తవాలు#GarikipatiNarasimhaRao #Kameshwari #UANow pic.twitter.com/PbMiNrF5QF
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 12, 2025