House Rental: మనం నివసించే ఇల్లు అన్ని విషయాల్లో బాగుండాలని కోరుకుంటాం. ఇటీవల కాలంలో వాస్తు వాస్త్రం బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీంతో ప్రతి ఒక్కరు వాస్తు బాుగుండాలని ఆశించడంలో తప్పు లేదు. మనం ఉండేది అద్దె ఇల్లయినా అన్ని సరిగా ఉంటేనే చేరేందుకు ఇష్టపడతాం. ఏది తక్కువైనా చేరడం జరగదు. ఎందుకంటే వాస్తు ప్రభావం మనల్ని ఇబ్బంది పెడుతుంది. కష్టాల పాలు చేస్తుంద. అందుకే సెంటిమెంట్ గా ముందే ఇంటి వాస్తును అంచనా వేయడం మంచిది. లేదంటే తరువాత కష్టాలు వస్తాయి. ఇటీవల కాలంలో అద్దె ఇల్లలోనే ఎక్కువ కాలం గడపాల్సి వస్తోంది. ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలు తిరిగే వారికి అద్దె ఇల్లే కదా ఆశ్రయం కల్పించేవి. అందుకే పక్కా వాస్తు ఉన్న ఇళ్లనే ఎంచుకుని తమ నివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం.

మనం అద్దెకు తీసుకోబోయే ఇల్లు ప్రధాన ద్వారంపై ఓ లుక్కేయండి. అది ఈశాన్యంలో ఉందా? దక్షిణంగా ఉందా? అనేది తేల్చుకోండి. ప్రధాన ద్వారం ఈశాన్యంగా ఉంటేనే మనకు మంచిది. లోపలికి వెళ్లేటప్పుడు విద్యుత్ స్తంభాలు లాంటివి ఉన్నాయో లేదో చూసుకోండి. అవి ఉంటే మనకు మంచిది కాదు. వాస్తు దోషం కలుగుతుంది. అందుకే జాగ్రత్తగా పరిశీలించండి. అద్దె ఇల్లయినా పక్కా వాస్తు ఉంటేనే దోషం లేకుండా ఉంటుంది. అప్పుడే మనకు బాగుంటుంది.
Also Read: Chanakya Niti on Friendship: చాణక్యనీతి: జీవితం నాశనం కాకుండా ఉండాలంటే వారికి దూరంగా ఉండండి
ఇంటి వంట గది ఎటు వైపు ఉందో చూసుకోండి. వంట గది ఎప్పుడు కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. లేక వాయివ్యంలో గానీ, నైరుతిలో గానీ ఉంటే అందులో చేరకండి వంటిల్లు ఆగ్నేయమే బెటర్. ఇది గమనించుకోండి. చిన్న చిన్న పొరపాట్లే రేపు మనకు గ్రహపాట్లు అవుతాయి. అందుకే ఇంటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతోంది. లేకపోతే మనం ఉన్నన్ని రోజులు కష్టాలతోనే కాపురం చేయాల్సి ఉంటుంది. అన్ని సమస్యలే వస్తాయి. అంుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి మరి.

ఇక బెడ్ రూం నైరుతి దిశలో ఉంటేనే మంచిది. లేకపోతే సమస్యలు వస్తాయి. మనం నిద్రించే చోటు కూడా మనకు కీడు తెస్తుంది. వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తప్పవు. తలుపులు కూడా లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు శబ్ధం రాకూడదు. ఒకవేళ చప్పుడు వస్తే మనకు మంచిది కాదు. అందుకే ఈ జాగ్రత్తల్ని పాటించి కొత్తగా చేరబోయే ఇంటిని ఎంచుకోండి. తరువాత కష్టాల పాలైతే ఇబ్బందులు పడతారు. అందుకే అద్దె ఇల్లయినా అన్ని ఉండాలని గుర్తుంచుకోండి.
Also Read: Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ.. హిట్టా ? పట్టా ?