https://oktelugu.com/

Love: మీ ప్రేమను ఇలా తెలియజేయండి.. రిలేషన్ పదికాలాల పాటు చల్లగా ఉంటుంది

అప్పుడప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుందని చెప్తే ఆమె మనసు ఎంత ఆనందంతో నిండి ఉంటుందో తెలుసా? ఒక్కసారి మీరు ఇచ్చే కాంప్లిమెంట్ వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 13, 2024 / 03:32 PM IST

    Love

    Follow us on

    Love: ప్రేమ ఇదొక గొప్ప అనుభూతి. దీన్ని అనుభవించడం చాలా కష్టం. ఒకప్పుడు నిజమైన ప్రేమ లభించేది. కానీ ఈ రోజుల్లో ప్రేమ దొరకడం చాలా కష్టమేనండోయ్. కేవలం అట్రాక్షన్ కు కొందరు పెట్టుకుంటున్న పేరు ప్రేమ. అందుకే ఒకేసారీ ఇద్దరితో రిలేషన్ లో ఉంటున్నారు నేటి యువత కొందరు. ఇదంతా పక్కన పెడితే నిజమైన లవ్ ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే లవ్ ని తెలియజేయడానికి మాటలు లేని భాష ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పనులు ఉంటాయి. కానీ ఫలితం సంతోషం. మరి అదేంటో తెలుసా?

    అప్పుడప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుందని చెప్తే ఆమె మనసు ఎంత ఆనందంతో నిండి ఉంటుందో తెలుసా? ఒక్కసారి మీరు ఇచ్చే కాంప్లిమెంట్ వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక రోజంతా కష్టపడి ఎన్నో పనులు చేస్తుంటుంది. జస్ట్ వంట చేసి మీకు వడ్డించి తినేటప్పుడు పక్కన కూర్చున్నప్పుడు ఈ రోజు వంట బాగుండి అంటే చాలు తెగ మురిసిపోతుంది.

    కొందరికి పదాలతో, మాటలతో ప్రేమను చెబితే నచ్చదు. చిన్న చిన్న సహాయం చేస్తే చాలు సంతోషిస్తారు. అప్పుడప్పుడు మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకురావడం, ఇద్దరు కలిసి ఇల్లు క్లీన్ చేయడం, కాఫీ పెట్టివ్వడం వంటివి చేస్తే కూడా చాలా ఆనంద పడుతారు. కానీ ఇవి అడిగేకంటే ముందే చేయాలని గుర్తుపెట్టుకోండి. కొందరికి పొగడటం, సహాయం చేయడం నచ్చదు. వీరు కేవలం మరీ చిన్న విషయానికే సూపర్ హ్యాపీ అవుతారు. ఇలాంటి వారికి కేవలం కాస్త సమయం చాలు.

    కాసేపు వారితో క్వాలిటీ టైమ్..అంటే ఫోన్ లను, ల్యాప్ టాప్ లను పక్కన పెట్టి వారితో మాత్రమే గడపండి. వారి పక్కన కూర్చొని చేతిలో చేయి వేసి అలా కాసేపు మాట్లాడండి. రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడిన ప్రతి రోజు ఆ పదినిమిషాల కోసం వెయిట్ చేస్తుంటారు. కొందరికి ఏకంగా ఒక హగ్, లేదా చేయి పట్టుకొని నడవటం వంటివి చేస్తే చాలు సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ లు ఇవ్వండి. వీటి వల్ల మరింత హ్యాపీ అవుతారు. చూశారుగా ఖర్చు లేని పని కానీ ప్రేమ మాత్రం బోలెడు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ లైఫ్